ఇంత సేయ జెల్లునా యీరమణిఁ బెడఁబాసి
(॥పల్లవి॥)
ఇంత సేయ జెల్లునా యీరమణిఁ బెడఁబాసి
యెంత కెంత విన్నవించే నింక నీచిత్తమురా
(॥॥)
విరులు ముడువఁ బోతే వెలది యేమో కాని
మరుని బాణములంటా మచ్చరించీ ని
నిరతిఁ గొప్పుదువ్వితే నిండుఁదుమ్మిదలగుంపు
వరుస రేఁచేరంటా వద్దనీఁ జెలి
(॥॥)
పయ్యద వెట్టఁగఁబోతే బలుజక్కవలతోడ
కయ్య మందించేనంటాఁ గసరీని
పుయ్యఁగ గందము చూచి పొరిఁ గాలకూటమంటా
నెయ్యపుఁజెలులఁ జూచి నేరమెంచీని
(॥॥)
అరుదైనమాణికాలహరము లియ్యఁగఁబోతే
విరహగ్ని శిఖలంటా వెఱచీని
గరమ శ్రీవెంకటేశ కలసితి వింతలోనే
యిసరసై యలమేల్మంగ యిటు మెచ్చీని
(||pallavi||)
iṁta seya jĕllunā yīramaṇim̐ bĕḍam̐bāsi
yĕṁta kĕṁta vinnaviṁche niṁka nīsittamurā
(||||)
virulu muḍuvam̐ bode vĕladi yemo kāni
maruni bāṇamulaṁṭā machchariṁchī ni
niradim̐ gŏppuduvvide niṁḍum̐dummidalaguṁpu
varusa rem̐seraṁṭā vaddanīm̐ jĕli
(||||)
payyada vĕṭṭam̐gam̐bode balujakkavaladoḍa
kayya maṁdiṁchenaṁṭām̐ gasarīni
puyyam̐ga gaṁdamu sūsi pŏrim̐ gālagūḍamaṁṭā
nĕyyabum̐jĕlulam̐ jūsi neramĕṁchīni
(||||)
arudainamāṇigālaharamu liyyam̐gam̐bode
virahagni śhikhalaṁṭā vĕṟasīni
garama śhrīvĕṁkaḍeśha kalasidi viṁtalone
yisarasai yalamelmaṁga yiḍu mĕchchīni