Imta sesinavaamdavu yinnidaa neeve

ఇంత సేసినవాఁడవు యిన్నిటా నీవే
Language

(॥పల్లవి॥)
ఇంత సేసినవాఁడవు యిన్నిటా నీవే
వింతలు నేఁడు చూపఁగా వెరగయ్యీని

(॥ఇంత॥)
చాయల సన్నల నీవు సవతికి నాకును
నాయములు చెప్పఁగాను నవ్వు వచ్చీని
ఆయము లంటి యిద్దరి నప్పటి మోములు చూచి
చేయిఁ జేతఁ బెనఁగఁగా సిగ్గు నిండీని

(॥ఇంత॥)
చద్దికి వేఁడికి నీవు సారెకు నాపెకు నాకు
బుద్దులెల్లఁ జెప్పఁగా నబ్బురమయ్యీని
వొద్దికతో నీకాఁగిట నొకరొకరు నించఁగా
పెద్దగాఁ జుట్టరికము పెడరేఁగీని

(॥ఇంత॥)
సరికి బేసికి నీవు సమ్మతి నొడఁబరచి
వెరవుతోఁ గూడఁగాను వేడుకయ్యీని
అరుదై శ్రీవేంకటెశ యక్కచెల్లెండ్లము మమ్ముఁ
నిరుమేలఁ బెట్టుకోఁగా నెన్నికయ్యీని

(||pallavi||)
iṁta sesinavām̐ḍavu yinniḍā nīve
viṁtalu nem̐ḍu sūbam̐gā vĕragayyīni

(||iṁta||)
sāyala sannala nīvu savadigi nāgunu
nāyamulu sĕppam̐gānu navvu vachchīni
āyamu laṁṭi yiddari nappaḍi momulu sūsi
seyim̐ jedam̐ bĕnam̐gam̐gā siggu niṁḍīni

(||iṁta||)
saddigi vem̐ḍigi nīvu sārĕgu nābĕgu nāgu
buddulĕllam̐ jĕppam̐gā nabburamayyīni
vŏddigado nīgām̐giḍa nŏgarŏgaru niṁcham̐gā
pĕddagām̐ juṭṭarigamu pĕḍarem̐gīni

(||iṁta||)
sarigi besigi nīvu sammadi nŏḍam̐barasi
vĕravudom̐ gūḍam̐gānu veḍugayyīni
arudai śhrīveṁkaḍĕśha yakkasĕllĕṁḍlamu mammum̐
nirumelam̐ bĕṭṭugom̐gā nĕnnigayyīni