ఇంత సేసినవాఁడవు యిఁక న న్నేలక పోదు
(॥పల్లవి॥)
ఇంత సేసినవాఁడవు యిఁక న న్నేలక పోదు
చింత దీర నీవే రక్షించుకొంట గాకా
(॥ఇంత॥)
మక్కువ నీతో నేను మాటాడి యెఱుఁగుదునా
చొక్కపు నీవైన రూపు చూపితివా
నిక్కము నీ వుండేటి నెలవు దెలిసితినా
చిక్కి నీవే నా మది నిల్చితి వింతే కాక
(॥ఇంత॥)
కోరి నీ యవతారాల కూడిమాడి యాడితినా
యేరీతి నైనా సేవ సేయించుకొంటివా
నేరిచి వొకనాఁడైనా నిన్ను నేఁ దలఁచితినా
వూరకే నీ కృప నాపై నుంచితివి గాకా
(॥ఇంత॥)
యెన్నఁడైనా నిన్ను నేను యెనసి కొలిచితినా
నిన్న దేవ రనుచు నెమకితినా
పన్నుగా నలమేల్మంగపతి శ్రీవేంకటేశ
తిన్నఁగా న న్నుద్ధరించితివి నీవే కాక
(||pallavi||)
iṁta sesinavām̐ḍavu yim̐ka na nnelaga podu
siṁta dīra nīve rakṣhiṁchugŏṁṭa gāgā
(||iṁta||)
makkuva nīdo nenu māḍāḍi yĕṟum̐gudunā
sŏkkabu nīvaina rūbu sūbidivā
nikkamu nī vuṁḍeḍi nĕlavu dĕlisidinā
sikki nīve nā madi nilsidi viṁte kāga
(||iṁta||)
kori nī yavadārāla kūḍimāḍi yāḍidinā
yerīdi nainā seva seyiṁchugŏṁṭivā
nerisi vŏganām̐ḍainā ninnu nem̐ dalam̐sidinā
vūrage nī kṛpa nābai nuṁchidivi gāgā
(||iṁta||)
yĕnnam̐ḍainā ninnu nenu yĕnasi kŏlisidinā
ninna deva ranusu nĕmagidinā
pannugā nalamelmaṁgabadi śhrīveṁkaḍeśha
tinnam̐gā na nnuddhariṁchidivi nīve kāga