ఇంత సేసినవాఁడవు యిదె నీవె కదవయ్యా
(॥పల్లవి॥)
ఇంత సేసినవాఁడవు యిదె నీవె కదవయ్యా
వింతలుగా సారెసారె విఱ్ఱవీఁగీఁ దాను
(॥ఇంత॥)
పొలఁతి గుబ్బలమీఁది పొగడ పువ్వుల దండ
చెలఁగి యాపెకు నీవిచ్చితివి వోయి
చెలులతోఁ జెప్పుతాను చెంగటి సవతులకు
పలుమారుఁ జూపి యెమ్మె పచరించీఁ దాను
(॥ఇంత॥)
పెదవిపై గానవచ్చే పెద్దకప్పురపు లప్ప
అదన నీవంపితివా ఆపెకు నేఁడు
వుదుటునఁ జవిగొంటా వొద్దనుండే యింతులను
యెదుట నోరూరించి యెలయించీఁ దాను
(॥ఇంత॥)
అందపుఁ జెక్కులమీఁదనంటి బేంట్లు రాలీ
గందము వూసితివా కాంతకు నీవు
ముందె నన్నుఁగూడితివి మోహాన శ్రీ వేంకటేశ
చిందినరజములెల్లా చేతనెత్తీఁ దాను
(||pallavi||)
iṁta sesinavām̐ḍavu yidĕ nīvĕ kadavayyā
viṁtalugā sārĕsārĕ viṭravīm̐gīm̐ dānu
(||iṁta||)
pŏlam̐ti gubbalamīm̐di pŏgaḍa puvvula daṁḍa
sĕlam̐gi yābĕgu nīvichchidivi voyi
sĕluladom̐ jĕppudānu sĕṁgaḍi savadulagu
palumārum̐ jūbi yĕmmĕ pasariṁchīm̐ dānu
(||iṁta||)
pĕdavibai gānavachche pĕddagappurabu lappa
adana nīvaṁpidivā ābĕgu nem̐ḍu
vuduḍunam̐ javigŏṁṭā vŏddanuṁḍe yiṁtulanu
yĕduḍa norūriṁchi yĕlayiṁchīm̐ dānu
(||iṁta||)
aṁdabum̐ jĕkkulamīm̐danaṁṭi beṁṭlu rālī
gaṁdamu vūsidivā kāṁtagu nīvu
muṁdĕ nannum̐gūḍidivi mohāna śhrī veṁkaḍeśha
siṁdinarajamulĕllā sedanĕttīm̐ dānu