Imta sesinavaamdavu yiddarigi neevegaavaa

ఇంత సేసినవాఁడవు యిద్దరికి నీవేకావా
Language

(॥పల్లవి॥)
ఇంత సేసినవాఁడవు యిద్దరికి నీవేకావా
దొంతి విడేలు వెట్టేవు తొడిఁబడ నేఁడు

(॥॥)
జగడించేసవతుల సంగడికి నీవు వచ్చి
తగవులు చెప్పేవు తమకానను
నిగిడి వొండొక రట్టె నీమీఁద వొట్టువెట్టఁగా
నగవులు నవ్వేవు నడుమ నేఁడు

(॥॥)
కొద్దిమీరఁ బంతాలాడే కొమ్మలవద్దికి వచ్చి
బుద్దులెల్లాఁ జెప్పేవు పొసఁగఁగను
చద్దికి వేఁడికిఁ దమలో సాకిరి నిన్నుఁ గోరఁగా
పెద్దరికాన మించేవు పీఁటమీఁద నేఁడు

(॥॥)
రాఁగతానాన జరసేరమణులఁ జేరవచ్చి
కాఁగిలింపించి కూడేవు కందువ లంటి
ఆఁగుచు శ్రీవేంకటేశ అట్టె నీమో వెడుగఁగా
మాఁగి రతిఁ జొక్కించేవు మగువల నేఁడు

(||pallavi||)
iṁta sesinavām̐ḍavu yiddarigi nīvegāvā
dŏṁti viḍelu vĕṭṭevu tŏḍim̐baḍa nem̐ḍu

(||||)
jagaḍiṁchesavadula saṁgaḍigi nīvu vachchi
tagavulu sĕppevu tamagānanu
nigiḍi vŏṁḍŏga raṭṭĕ nīmīm̐da vŏṭṭuvĕṭṭam̐gā
nagavulu navvevu naḍuma nem̐ḍu

(||||)
kŏddimīram̐ baṁtālāḍe kŏmmalavaddigi vachchi
buddulĕllām̐ jĕppevu pŏsam̐gam̐ganu
saddigi vem̐ḍigim̐ damalo sāgiri ninnum̐ goram̐gā
pĕddarigāna miṁchevu pīm̐ṭamīm̐da nem̐ḍu

(||||)
rām̐gadānāna jaraseramaṇulam̐ jeravachchi
kām̐giliṁpiṁchi kūḍevu kaṁduva laṁṭi
ām̐gusu śhrīveṁkaḍeśha aṭṭĕ nīmo vĕḍugam̐gā
mām̐gi radim̐ jŏkkiṁchevu maguvala nem̐ḍu