Imta sesinatti tannu nemi seseme

ఇంత సేసినట్టి తన్ను నేమి సేసేమే
Language

(॥పల్లవి॥)
ఇంత సేసినట్టి తన్ను నేమి సేసేమే
చింతతోడ నాచెక్కు చేతిమీఁది కెక్కెనూ

(॥ఇంత సేసి॥)
దవ్వుల నుండేతనకు దండము వెట్టితి మిదె
యివ్వల నింకా మాతో నేమి నవ్వీనే
రవ్వ లాయ మావలపురాజ్యములోన నెల్ల
పువ్వుటమ్ములమనసు పుర వురఁ బొక్కెను

(॥ఇంత వేసి॥)
పట్టక తొల్లె తనకుఁ బంత మిచ్చితి మిదె
యిట్టె మాదిక్కు తా నేమి చూచీనే
వెట్టివిన్నపము లాయ వేగుదాఁకా మాకతలు
జట్టిగా మావిరహము చల్లువెద లాయను

(॥ఇంత సేసి॥)
చేరి తాఁ బైకొనఁ గానె చేతికి లో నైతి మిదె
యీరీతి నాయడకు తా నెంత సేసీనే
కూరిమి నిట్టె నన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు
తీరుకు వచ్చి పనులు తేటతెల్ల మాయను

(||pallavi||)
iṁta sesinaṭṭi tannu nemi seseme
siṁtadoḍa nāsĕkku sedimīm̐di kĕkkĕnū

(||iṁta sesi||)
davvula nuṁḍedanagu daṁḍamu vĕṭṭidi midĕ
yivvala niṁkā mādo nemi navvīne
ravva lāya māvalaburājyamulona nĕlla
puvvuḍammulamanasu pura vuram̐ bŏkkĕnu

(||iṁta vesi||)
paṭṭaga tŏllĕ tanagum̐ baṁta michchidi midĕ
yiṭṭĕ mādikku tā nemi sūsīne
vĕṭṭivinnabamu lāya vegudām̐kā māgadalu
jaṭṭigā māvirahamu salluvĕda lāyanu

(||iṁta sesi||)
seri tām̐ baigŏnam̐ gānĕ sedigi lo naidi midĕ
yīrīdi nāyaḍagu tā nĕṁta sesīne
kūrimi niṭṭĕ nannum̐ gūḍĕ śhrīvĕṁkaḍeśhum̐ḍu
tīrugu vachchi panulu teḍadĕlla māyanu