Imta sesinamgaaga neevela sikkevu

ఇంత సేసినఁగాక నీవేల చిక్కేవు
Language

(॥పల్లవి॥)
ఇంత సేసినఁగాక నీవేల చిక్కేవు
చెంతనే నే మున్నారము చేకొనఁగరాదా

(॥ఇంత॥)
తెరవేసుకొని యాపె తేనేలమాట లాడితే
కరఁగుఁచు గూడెనంటా కాఁతాళించేవు
విరులచెం డప్పటిని వెలి నీపై వేసితేను
తరితీపునఁ జేఁబట్టి తమకించేవు

(॥ఇంత॥)
సోరణగండ్ల నాకె సొలసి నిన్నుఁ జూచితే
మేరతో లోనికిఁబోఁ దిమిరి తూరేవు
గారవించి నయముగా కలకలనవ్వితేను
ఆరసి మదనరతి కటు పదరేవు

(॥ఇంత॥)
అట్టె కొనగోర నిన్ను నవ్వలనుండి వూదితే
గట్టిగా పారపుచేరి కలసితివి
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
గుట్టు సేసితే సారెకు కోరి వలచేవు

(||pallavi||)
iṁta sesinam̐gāga nīvela sikkevu
sĕṁtane ne munnāramu segŏnam̐garādā

(||iṁta||)
tĕravesugŏni yābĕ tenelamāḍa lāḍide
karam̐gum̐su gūḍĕnaṁṭā kām̐tāḽiṁchevu
virulasĕṁ ḍappaḍini vĕli nībai vesidenu
taridībunam̐ jem̐baṭṭi tamagiṁchevu

(||iṁta||)
soraṇagaṁḍla nāgĕ sŏlasi ninnum̐ jūside
merado lonigim̐bom̐ dimiri tūrevu
gāraviṁchi nayamugā kalagalanavvidenu
ārasi madanaradi kaḍu padarevu

(||iṁta||)
aṭṭĕ kŏnagora ninnu navvalanuṁḍi vūdide
gaṭṭigā pārabuseri kalasidivi
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
guṭṭu seside sārĕgu kori valasevu