ఇంత సేసితివి నీవే యిందాఁకాను
(॥పల్లవి॥)
ఇంత సేసితివి నీవే యిందాఁకాను
యెఁ(యెం?)తైనాఁ గద్దు చలము యేమిసేతురా
(॥ఇంత॥)
మంచిమాఁట లాడేనంటేమరి వెంగేలే తోఁచీ
చుంచుల నిచ్చకములు సూటిపడవు
లంచము మోవిచ్చేనంటే లావులఁ బెనఁగీ మోము
యెంచరాదు నాపంతము యేమి సేతురా
(॥ఇంత॥)
సేవలు సేసేనంటే చేతికొనగోరు దాఁకీ
వోవరిలో మనసులువుడికించీని
భావించి నవ్వేనంటే పగిడి వెట్టినట్టయ్యీ
యీవిధము నావుదుటు లేమిసేతురా
(॥ఇంత॥)
మెచ్చి కాఁగిలించుకొంటే మేనిగురుతులు రాఁగీ
కొచ్చికొచ్చి సిగ్గులెల్లా గుంపుగూడీని
ఇచ్చట శ్రీవేంకటేశ యేలితి వింతలో నన్ను
యెచ్చరించీ మర్మములు యేమిసేతురా
(||pallavi||)
iṁta sesidivi nīve yiṁdām̐kānu
yĕm̐(yĕṁ?)tainām̐ gaddu salamu yemisedurā
(||iṁta||)
maṁchimām̐ṭa lāḍenaṁṭemari vĕṁgele tom̐sī
suṁchula nichchagamulu sūḍibaḍavu
laṁchamu movichchenaṁṭe lāvulam̐ bĕnam̐gī momu
yĕṁcharādu nābaṁtamu yemi sedurā
(||iṁta||)
sevalu sesenaṁṭe sedigŏnagoru dām̐kī
vovarilo manasuluvuḍigiṁchīni
bhāviṁchi navvenaṁṭe pagiḍi vĕṭṭinaṭṭayyī
yīvidhamu nāvuduḍu lemisedurā
(||iṁta||)
mĕchchi kām̐giliṁchugŏṁṭe menigurudulu rām̐gī
kŏchchigŏchchi siggulĕllā guṁpugūḍīni
ichchaḍa śhrīveṁkaḍeśha yelidi viṁtalo nannu
yĕchchariṁchī marmamulu yemisedurā