Imta sesidivi neeve imtilonunna nannu

ఇంత సేసితివి నీవే ఇంటిలోనున్న నన్ను
Language

(॥పల్లవి॥)
ఇంత సేసితివి నీవే ఇంటిలోనున్న నన్ను
పంత మెంచి చూచితే నాపాటిదా ఆపె

(॥ఇంత॥)
అంచెల నన్ను రప్పించి అట్టె నే నిలుచుండఁగా
మంచముపై నాకెతోనే మాటలాడేవు
పొంచి యందుకుఁగా పువ్వులచెండు వేసితే
కొంచక తానేల అందుకొని నీకె నడుమ

(॥ఇంత॥)
సన్నలు నాకుఁ జేసి సరి నే నీతో నవ్వంగా
చెన్ను మీర నాపెమీఁదఁ జేయి చాఁచేవు
యెన్నఁ దమ్మితూఁడు నీపై నిందుకుఁగాఁ దాఁకించితే
ఇన్నిటాఁ దానేల యీపె యెడచొచ్చీ నడుమను

(॥ఇంత॥)
కంకణము నాకుఁ గట్టి కాఁగిట నే నించఁగాను
సంకెలేక ఆపెదిక్కు సారెఁ జూచేవు
అంకెల శ్రీవేంకటేశ అడ్డము తెర దీసితే
ఇంకాఁ దానేల లోని కేతెంచీ నడుమ

(||pallavi||)
iṁta sesidivi nīve iṁṭilonunna nannu
paṁta mĕṁchi sūside nābāḍidā ābĕ

(||iṁta||)
aṁchĕla nannu rappiṁchi aṭṭĕ ne nilusuṁḍam̐gā
maṁchamubai nāgĕdone māḍalāḍevu
pŏṁchi yaṁdugum̐gā puvvulasĕṁḍu veside
kŏṁchaga tānela aṁdugŏni nīgĕ naḍuma

(||iṁta||)
sannalu nāgum̐ jesi sari ne nīdo navvaṁgā
sĕnnu mīra nābĕmīm̐dam̐ jeyi sām̐sevu
yĕnnam̐ dammidūm̐ḍu nībai niṁdugum̐gām̐ dām̐kiṁchide
inniḍām̐ dānela yībĕ yĕḍasŏchchī naḍumanu

(||iṁta||)
kaṁkaṇamu nāgum̐ gaṭṭi kām̐giḍa ne niṁcham̐gānu
saṁkĕlega ābĕdikku sārĕm̐ jūsevu
aṁkĕla śhrīveṁkaḍeśha aḍḍamu tĕra dīside
iṁkām̐ dānela loni kedĕṁchī naḍuma