Imta sesi vunnaamdavu yeramganatte yeeda

ఇంత సేసి వున్నాఁడవు యెరఁగనట్టే యీడ
Language

(॥పల్లవి॥)
ఇంత సేసి వున్నాఁడవు యెరఁగనట్టే యీడ
సంతోసవార్త చెప్పితిఁ జనవియ్యనయ్యా

(॥ఇంతా॥)
కలికికి నీచూవు కలువపూదండయై
యెలమి మెడఁ దగిలె నిఁక రావయ్యా
తలకెక్కినవలపు దట్టపు బాసికమాయ
పిలిచీ నాపె నిన్నుఁ బెండ్లాడవయ్యా

(॥ఇంతా॥)
నీవువెట్టినవిడెమె నిశ్చయతాంబలమాయ
వేవేగ సింగారించుక నిచ్చేయవయ్యా
మూవంక పెంజెమటలే ముత్యాల శాసలాయ
కావించి కంకణ మిట్టె కట్టుకొనవయ్యా

(॥ఇంతా॥)
పూని నీవాడినామాంటే బువ్వపుఁబొత్తు గలసె
పానుపుమీఁదికి నిఁకఁ బండవయ్యా
యీనెపాన శ్రీవేంకటేశ యీకె నేలితివి
తేనెమోవివిందులతోఁ దెప్పలఁ దేలవయ్యా

(||pallavi||)
iṁta sesi vunnām̐ḍavu yĕram̐ganaṭṭe yīḍa
saṁtosavārda sĕppidim̐ janaviyyanayyā

(||iṁtā||)
kaligiki nīsūvu kaluvabūdaṁḍayai
yĕlami mĕḍam̐ dagilĕ nim̐ka rāvayyā
talagĕkkinavalabu daṭṭabu bāsigamāya
pilisī nābĕ ninnum̐ bĕṁḍlāḍavayyā

(||iṁtā||)
nīvuvĕṭṭinaviḍĕmĕ niśhchayadāṁbalamāya
vevega siṁgāriṁchuga nichcheyavayyā
mūvaṁka pĕṁjĕmaḍale mutyāla śhāsalāya
kāviṁchi kaṁkaṇa miṭṭĕ kaṭṭugŏnavayyā

(||iṁtā||)
pūni nīvāḍināmāṁṭe buvvabum̐bŏttu galasĕ
pānubumīm̐digi nim̐kam̐ baṁḍavayyā
yīnĕbāna śhrīveṁkaḍeśha yīgĕ nelidivi
tenĕmoviviṁduladom̐ dĕppalam̐ delavayyā