Imta sesemgaa maaya iddarimaayedanu

ఇంత సేసెఁగా మాయ ఇద్దరిమాయెడను
Language

(॥పల్లవి॥)
ఇంత సేసెఁగా మాయ ఇద్దరిమాయెడను
చింతించే నిందుకే పతిచిత్త మెటులుండునో

(॥ఇంత॥)
తప్పక తాఁ జూచినాను తలవంచి చూడనైతి
అప్పుడే రాఁడాయనని ఆ కోపాన
చిప్పిలఁ దా నవ్వినాను సెలవిని నవ్వనైతి
చెప్పుడుమాటలు విన్న చిత్తపుఁగోపానము

(॥ఇంత॥)
కాలు దాఁకినాను నేను కడఁగి మొక్కనైతి
చాలి వొట్టువెట్టుకొన్నచలానను
కేలువట్టి తీసినాను కినిసి లోఁగా నైతి
జాలిమనసెఱఁగని సందేహమునసు

(॥ఇంత॥)
మచ్చికఁ దాఁ జెనకఁగా మారు నేఁ జెనకనైతి
పచ్చియైన సిగ్గుమీఁది పరాకున
తచ్చి శ్రీ వేంకటపతి తానే నన్నిటు గూడె
యిచ్చకమైతి నిప్పుడే యెక్కువ మోహానను

(||pallavi||)
iṁta sesĕm̐gā māya iddarimāyĕḍanu
siṁtiṁche niṁduge padisitta mĕḍuluṁḍuno

(||iṁta||)
tappaga tām̐ jūsinānu talavaṁchi sūḍanaidi
appuḍe rām̐ḍāyanani ā kobāna
sippilam̐ dā navvinānu sĕlavini navvanaidi
sĕppuḍumāḍalu vinna sittabum̐gobānamu

(||iṁta||)
kālu dām̐kinānu nenu kaḍam̐gi mŏkkanaidi
sāli vŏṭṭuvĕṭṭugŏnnasalānanu
keluvaṭṭi tīsinānu kinisi lom̐gā naidi
jālimanasĕṟam̐gani saṁdehamunasu

(||iṁta||)
machchigam̐ dām̐ jĕnagam̐gā māru nem̐ jĕnaganaidi
pachchiyaina siggumīm̐di parāguna
tachchi śhrī veṁkaḍabadi tāne nanniḍu gūḍĕ
yichchagamaidi nippuḍe yĕkkuva mohānanu