Imta sesembo daiva mimtalonane ayyo

ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో
Language

(॥పల్లవి॥)
ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో
సంతపాకలంజఁ దెచ్చి సన్యాసిఁ జేసె

(॥ఇంత॥)
పరిగెలేరేటివానిఁ బట్టపురాజుఁగా
నిరతభోగము లిచ్చి నిలిపినట్లు
ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు
అరయ నిత్తడిఁ దెచ్చి యపరంజిఁ జేసె

(॥ఇంత॥)
కుక్కలవండుకతినే కులహీనునిఁ దెచ్చి
వెక్కసఁబాఁపనిఁ గావించినయట్లు
దిక్కులెఱఁగఁగఁ గష్టదేహిని నన్నుఁ దెచ్చి
గక్కనఁ దెలుకపిండి కస్తూరి సేనె

(॥ఇంత॥)
చెడుగైనదోమఁ దెచ్చి సింహపుఁగొదమఁగా
బెడిదంపుఁ బ్రేమతోడఁ బెంచినయట్లు
కడునధముని వేంకటపతి నను నిటు
చిడిపిరాయి దెచ్చి చింతామణి సేనె

(||pallavi||)
iṁta sesĕm̐bo daiva miṁtalonane ayyo
saṁtabāgalaṁjam̐ dĕchchi sanyāsim̐ jesĕ

(||iṁta||)
parigĕlereḍivānim̐ baṭṭaburājum̐gā
niradabhogamu lichchi nilibinaṭlu
dharalona nadibādaguni nannu niṭlu
araya nittaḍim̐ dĕchchi yabaraṁjim̐ jesĕ

(||iṁta||)
kukkalavaṁḍugadine kulahīnunim̐ dĕchchi
vĕkkasam̐bām̐panim̐ gāviṁchinayaṭlu
dikkulĕṟam̐gam̐gam̐ gaṣhṭadehini nannum̐ dĕchchi
gakkanam̐ dĕlugabiṁḍi kastūri senĕ

(||iṁta||)
sĕḍugainadomam̐ dĕchchi siṁhabum̐gŏdamam̐gā
bĕḍidaṁpum̐ bremadoḍam̐ bĕṁchinayaṭlu
kaḍunadhamuni veṁkaḍabadi nanu niḍu
siḍibirāyi dĕchchi siṁtāmaṇi senĕ