ఇంత సేసె నని యాపె నేల దూరేవు
(॥పల్లవి॥)
ఇంత సేసె నని యాపె నేల దూరేవు
రంతు సేసి నిన్నుఁ గడు రవ్వసేయఁ జెల్లదా
(॥ఇంత॥)
చెప్పిన నీమాట లెల్లా చెవి యొగ్గి వినఁబోతే
కప్పురపులప్పకైనాఁ గాఁక రేఁగుఁబో
దప్పిదేర నాపె చేతి తామర విసరెఁ గాని
చెప్పరాని చేఁత లేమి సేసినానుఁ జెల్లదా
(॥ఇంత॥)
నెట్టనఁ బచ్చియైయున్న నీ మేను సాఁగితేను
పెట్టిన వెన్నెలకైనా వుడుకెత్తుఁబో
పెట్టిన తనపాదపు పెండెమున వేసెఁ గాని
యట్టె తరవాతిపను లాపె సేయఁ జెల్లదా
(॥ఇంత॥)
కందువ నీ కౌఁగిటిగాలి మీఁదఁ బారితేను
అంది యాఁడు బొమ్మకైనా నాస పుట్టుఁబో
యిందుకే శ్రీవేంకటేశ యీపె నిన్నుఁ గూడెఁ గాని
యెందులకు నైనా యిట్టే యేలయించఁ జెల్లదా
(||pallavi||)
iṁta sesĕ nani yābĕ nela dūrevu
raṁtu sesi ninnum̐ gaḍu ravvaseyam̐ jĕlladā
(||iṁta||)
sĕppina nīmāḍa lĕllā sĕvi yŏggi vinam̐bode
kappurabulappagainām̐ gām̐ka rem̐gum̐bo
dappidera nābĕ sedi tāmara visarĕm̐ gāni
sĕpparāni sem̐ta lemi sesinānum̐ jĕlladā
(||iṁta||)
nĕṭṭanam̐ bachchiyaiyunna nī menu sām̐gidenu
pĕṭṭina vĕnnĕlagainā vuḍugĕttum̐bo
pĕṭṭina tanabādabu pĕṁḍĕmuna vesĕm̐ gāni
yaṭṭĕ taravādibanu lābĕ seyam̐ jĕlladā
(||iṁta||)
kaṁduva nī kaum̐giḍigāli mīm̐dam̐ bāridenu
aṁdi yām̐ḍu bŏmmagainā nāsa puṭṭum̐bo
yiṁduge śhrīveṁkaḍeśha yībĕ ninnum̐ gūḍĕm̐ gāni
yĕṁdulagu nainā yiṭṭe yelayiṁcham̐ jĕlladā