Imta seduradave yimdarilona

ఇంత సేతురటవే యిందరిలోన
Language

(॥పల్లవి॥)
ఇంత సేతురటవే యిందరిలోన
కాంతుడు సిగ్గువడఁగా కాంతలెల్లా దూరిరి

(॥ఇంత॥)
మచ్చిక నాతఁడు నిన్ను మన్నించిన మన్ననకు
పచ్చిసేతురా మోవి పడఁతి నీవు
కుచ్చి యట్టే తలవంచుకొని యాతఁడుండఁగాను
ఇచ్చకపు చెలులెల్లా నెంతో నిన్నుదూరిరి

(॥ఇంత॥)
చల్లఁగా నాతఁడు నీకు చనవిచ్చినందుకు
వెల్లిగా నలయింతురా వేగినంతాను
బల్లిదుఁడైనాతఁడిట్టే పవ్వళించి వుండఁగాను
తొల్లిటిసతులెల్లాను తొడిఁబడ దూరిరి

(॥ఇంత॥)
అట్టె శ్రీవేంకటేశుఁ డంటి నిన్నేలినందుకు
నెట్టిన బాసగొందురా నీటుతోడను
వొట్టుక నీపంపు సేయుచుండఁగా నితనిఁజూచి
నెట్టుకొన్న మగువలు నిన్నుఁ గడు దూరిరి

(||pallavi||)
iṁta seduraḍave yiṁdarilona
kāṁtuḍu sigguvaḍam̐gā kāṁtalĕllā dūriri

(||iṁta||)
machchiga nādam̐ḍu ninnu manniṁchina mannanagu
pachchisedurā movi paḍam̐ti nīvu
kuchchi yaṭṭe talavaṁchugŏni yādam̐ḍuṁḍam̐gānu
ichchagabu sĕlulĕllā nĕṁto ninnudūriri

(||iṁta||)
sallam̐gā nādam̐ḍu nīgu sanavichchinaṁdugu
vĕlligā nalayiṁturā veginaṁtānu
ballidum̐ḍainādam̐ḍiṭṭe pavvaḽiṁchi vuṁḍam̐gānu
tŏlliḍisadulĕllānu tŏḍim̐baḍa dūriri

(||iṁta||)
aṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍaṁṭi ninnelinaṁdugu
nĕṭṭina bāsagŏṁdurā nīḍudoḍanu
vŏṭṭuga nībaṁpu seyusuṁḍam̐gā nidanim̐jūsi
nĕṭṭugŏnna maguvalu ninnum̐ gaḍu dūriri