ఇంత సేతురా యిటువలె రమణుని
(॥పల్లవి॥)
ఇంత సేతురా యిటువలె రమణుని
యింతిని నిను నెలయించె ననుచును
(॥॥)
సారెకు నేఁటికి జంకించేవే
కేరుచు నతఁడు నగె ననుచును
జీరలుగా గోరఁ జిమ్ముదురటవే
వూరకె పరాకై యుండె ననుచును
(॥॥)
పెనుఁదురు మేఁటికిఁ బిడికిటఁ బట్టేవే
ననుపున నీతోఁ బెనఁగె ననుచును
అనుగుకుచంబుల నదుముదు రటమే
తనలో నొకతెను తలఁచె ననుచును
(॥॥)
జంటల నింతేల చలములు మీ రేవే
నంటున నీతో నెనసెననుచును
ఇంటిలో శ్రీవేంకటేశు జరతురటే
అంటుచు సరసములాడే ననుచును
(||pallavi||)
iṁta sedurā yiḍuvalĕ ramaṇuni
yiṁtini ninu nĕlayiṁchĕ nanusunu
(||||)
sārĕgu nem̐ṭigi jaṁkiṁcheve
kerusu nadam̐ḍu nagĕ nanusunu
jīralugā goram̐ jimmuduraḍave
vūragĕ parāgai yuṁḍĕ nanusunu
(||||)
pĕnum̐duru mem̐ṭigim̐ biḍigiḍam̐ baṭṭeve
nanubuna nīdom̐ bĕnam̐gĕ nanusunu
anugugusaṁbula nadumudu raḍame
tanalo nŏgadĕnu talam̐sĕ nanusunu
(||||)
jaṁṭala niṁtela salamulu mī reve
naṁṭuna nīdo nĕnasĕnanusunu
iṁṭilo śhrīveṁkaḍeśhu jaraduraḍe
aṁṭusu sarasamulāḍe nanusunu