ఇంత సేతురా నీవు యెమ్మెకాఁడ
(॥పల్లవి॥)
ఇంత సేతురా నీవు యెమ్మెకాఁడ
వింతవాఁడవా నీవు వేడుకకాఁడ
(॥ఇంత॥)
పడఁతి విలువఁగాను పలుకక వూరకుండి
నడుమ నవ్వుదురా నాలికాఁడ
చిడుముడి నప్పటిని చెయివట్టి తియ్యఁగాను
జడిసి మారిడుదురా జాణకాఁడ
(॥ఇంత॥)
సిగ్గు విడిపించి సతి చెక్కునొక్కి వేఁడుకోఁగా
బగ్గన నలుగుదురా పంతగాఁడ
వెగ్గళమై ఆపె నీకు విందులమో వియ్యఁగాను
దగ్గరి వీడె మిత్తురా తాటోటుకాఁడ
(॥ఇంత॥)
చింతదీర నీమగువ చేరి కాఁగిలించుకొంటే
అంతలో భ్రమతురా అందగాఁడ
వంతుకు శ్రీవేంకటేశ వనిత నిన్నుఁ గలసె
బంతి నింతేసి మెత్తురా బయకాడ
(||pallavi||)
iṁta sedurā nīvu yĕmmĕgām̐ḍa
viṁtavām̐ḍavā nīvu veḍugagām̐ḍa
(||iṁta||)
paḍam̐ti viluvam̐gānu palugaga vūraguṁḍi
naḍuma navvudurā nāligām̐ḍa
siḍumuḍi nappaḍini sĕyivaṭṭi tiyyam̐gānu
jaḍisi māriḍudurā jāṇagām̐ḍa
(||iṁta||)
siggu viḍibiṁchi sadi sĕkkunŏkki vem̐ḍugom̐gā
baggana nalugudurā paṁtagām̐ḍa
vĕggaḽamai ābĕ nīgu viṁdulamo viyyam̐gānu
daggari vīḍĕ mitturā tāḍoḍugām̐ḍa
(||iṁta||)
siṁtadīra nīmaguva seri kām̐giliṁchugŏṁṭe
aṁtalo bhramadurā aṁdagām̐ḍa
vaṁtugu śhrīveṁkaḍeśha vanida ninnum̐ galasĕ
baṁti niṁtesi mĕtturā bayagāḍa