(॥పల్లవి॥)
ఇంత చలము నీ కే లమ్మా
కొంతయినఁ దెలుసుకో వమ్మా
(॥ఇంత॥)
అలుకలుఁ బులుకలు నాతనితోడను
వలవని దేఁటికి వద్దమ్మా
మొలకల నవ్వులు ముంచఁగ నీకిఁకఁ
దల వంచు కొనఁగఁ దఁగ దమ్మా
(॥ఇంత॥)
పెనఁగులు జనుగులుఁ బెట్టేవు పిలువఁగ
పని మాలినపని బలు వమ్మా
చనవులు నీ పతి చల్లఁగ మరి యిఁక
వెనకటిమంకులు విడ వమ్మా
(॥ఇంత॥)
అసురులు నుసురులు నందినకాఁగిట
వసివాడులు నిఁక వలె నమ్మా
యెసగిన శ్రీవెంకటేశుఁడు గూడెను
పొసఁగె నిన్నియును భోగించ వమ్మా
(||pallavi||)
iṁta salamu nī ke lammā
kŏṁtayinam̐ dĕlusugo vammā
(||iṁta||)
alugalum̐ bulugalu nādanidoḍanu
valavani dem̐ṭigi vaddammā
mŏlagala navvulu muṁcham̐ga nīgim̐kam̐
dala vaṁchu kŏnam̐gam̐ dam̐ga dammā
(||iṁta||)
pĕnam̐gulu janugulum̐ bĕṭṭevu piluvam̐ga
pani mālinabani balu vammā
sanavulu nī padi sallam̐ga mari yim̐ka
vĕnagaḍimaṁkulu viḍa vammā
(||iṁta||)
asurulu nusurulu naṁdinagām̐giḍa
vasivāḍulu nim̐ka valĕ nammā
yĕsagina śhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍĕnu
pŏsam̐gĕ ninniyunu bhogiṁcha vammā