ఇంత చాలదా నిష్టూర మింకా వేరేవలెనా
(॥పల్లవి॥)
ఇంత చాలదా నిష్టూర మింకా వేరేవలెనా
మంతన మిదే చాలదా మర్మములు రేఁచను
(॥ఇంత॥)
నవ్వితేనే చాలదా నాతులమనసులలో
అవ్వలఁ బంచబాణములై నాఁటును
దవ్వుల మాఁటలాడితే తగ నదే చాలదా
పువ్వుల తేనియలై తీపులు రేఁచును
(॥ఇంత॥)
చూచితేనే చాలదా సుదతుల మేనుల
కాచినట్టే పులకలగని చూపుమట్లు
చేచేత నీ వంటితేనే సేనలుగాఁ జాలదా
తాచినట్టె వలపులతమి రేఁచును
(॥ఇంత॥)
సన్న యిదె చాలదా చక్కని శ్రీవేంకటేశ
యిన్నిటా నిన్నును నన్ను నెనయించెను
మన్నించి నీవు నన్ను మరుగుటే చాలదా
విన్న కన్న జాడలను వేడుకలు రేఁచును
(||pallavi||)
iṁta sāladā niṣhṭūra miṁkā verevalĕnā
maṁtana mide sāladā marmamulu rem̐sanu
(||iṁta||)
navvidene sāladā nādulamanasulalo
avvalam̐ baṁchabāṇamulai nām̐ṭunu
davvula mām̐ṭalāḍide taga nade sāladā
puvvula teniyalai tībulu rem̐sunu
(||iṁta||)
sūsidene sāladā sudadula menula
kāsinaṭṭe pulagalagani sūbumaṭlu
seseda nī vaṁṭidene senalugām̐ jāladā
tāsinaṭṭĕ valabuladami rem̐sunu
(||iṁta||)
sanna yidĕ sāladā sakkani śhrīveṁkaḍeśha
yinniḍā ninnunu nannu nĕnayiṁchĕnu
manniṁchi nīvu nannu maruguḍe sāladā
vinna kanna jāḍalanu veḍugalu rem̐sunu