Imta saaladaa neegu yisugavimdu lelaraa

ఇంత చాలదా నీకు యిసుకవిూఁదు లేలరా
Language

(॥పల్లవి॥)
ఇంత చాలదా నీకు యిసుకవిూఁదు లేలరా
చింతతోడ నుండఁగాను చిముడఁజేయ నేలరా

(॥ఇంత॥)
కొసరి కొసరి నిన్నుఁ జూచి కోపగించఁ జాలకా
విసువుతోడ గొణఁగి పెదవి విఱుచుకొనఁగఁ జాలదా
పసలురేఁచి నీదుమేను పచ్చిసేయఁ జాలకా
ముసుగు వెట్టుకున్నదాన ముందు చెనక రాకురా

(॥ఇంత॥)
నాలిసేసి గేలిసేసి నవ్వ నిన్నుఁ జాలకా
వేళ వేళ నిన్నుఁ గినిసి వేసరించఁ జాలకా
నేల వ్రాత వ్రాసి నిన్ను నిందలాడఁ జాలకా
మూల నుండఁగాను నన్ను ముంగిట వేయ నేలరా

(॥ఇంత॥)
కదిసి మొక్కి నీదు మోవి గంటిసేయఁ జాలకా
మోదకి నిన్నుఁ జెలులయెదుట వెంగెమాడఁ జాలకా
అదన శ్రీవేంకటేశ ఆయ మంటి నిన్నుఁ గూడి
యెదుట నున్నదాన నన్ను యెమ్మె చూప నేలరా

(||pallavi||)
iṁta sāladā nīgu yisugaviూm̐du lelarā
siṁtadoḍa nuṁḍam̐gānu simuḍam̐jeya nelarā

(||iṁta||)
kŏsari kŏsari ninnum̐ jūsi kobagiṁcham̐ jālagā
visuvudoḍa gŏṇam̐gi pĕdavi viṟusugŏnam̐gam̐ jāladā
pasalurem̐si nīdumenu pachchiseyam̐ jālagā
musugu vĕṭṭugunnadāna muṁdu sĕnaga rāgurā

(||iṁta||)
nālisesi gelisesi navva ninnum̐ jālagā
veḽa veḽa ninnum̐ ginisi vesariṁcham̐ jālagā
nela vrāda vrāsi ninnu niṁdalāḍam̐ jālagā
mūla nuṁḍam̐gānu nannu muṁgiḍa veya nelarā

(||iṁta||)
kadisi mŏkki nīdu movi gaṁṭiseyam̐ jālagā
modagi ninnum̐ jĕlulayĕduḍa vĕṁgĕmāḍam̐ jālagā
adana śhrīveṁkaḍeśha āya maṁṭi ninnum̐ gūḍi
yĕduḍa nunnadāna nannu yĕmmĕ sūba nelarā