Imta saaladaa naagu yimdarilo ramanumda

ఇంత చాలదా నాకు యిందరిలో రమణుఁడ
Language

(॥పల్లవి॥)
ఇంత చాలదా నాకు యిందరిలో రమణుఁడ
సంతసాన నీకు మొక్కే సరసుఁడ విందుకు

(॥ఇంత॥)
చింతలన్నియునుఁ బాసె సిగ్గు లన్నియునుఁ దేరె
ఇంతలోనే విభుఁడ నీ వేడకు రాఁగా
మంతనాలు సరివచ్చె మర్మములన్నియుఁగొచ్చె
దొతులైన మాటలు నాతో నాడఁగాను

(॥ఇంత॥)
కపట మింతయుఁ బాసె కాఁకలెల్ల చల్లనారె
ఇపుడు నా చెక్కు నొక్కి యెనయఁగాను
తపమెల్లా ఫలిఇంచె తలఁపులు సరిగూడె
అపురూపముగ నాతో నంది నవ్వఁగాను

(॥ఇంత॥)
వలపులు దైవారె వాడికెలు తుదమీరె
వెలయ నాపై చేయి వేయఁగాను
కలికి శ్రీవేంకటేశ కాయము లొక్కటి యాయ
సొలపు రతుల నన్నుఁ జొక్కించఁగాను

(||pallavi||)
iṁta sāladā nāgu yiṁdarilo ramaṇum̐ḍa
saṁtasāna nīgu mŏkke sarasum̐ḍa viṁdugu

(||iṁta||)
siṁtalanniyunum̐ bāsĕ siggu lanniyunum̐ derĕ
iṁtalone vibhum̐ḍa nī veḍagu rām̐gā
maṁtanālu sarivachchĕ marmamulanniyum̐gŏchchĕ
dŏdulaina māḍalu nādo nāḍam̐gānu

(||iṁta||)
kabaḍa miṁtayum̐ bāsĕ kām̐kalĕlla sallanārĕ
ibuḍu nā sĕkku nŏkki yĕnayam̐gānu
tabamĕllā phaliiṁchĕ talam̐pulu sarigūḍĕ
aburūbamuga nādo naṁdi navvam̐gānu

(||iṁta||)
valabulu daivārĕ vāḍigĕlu tudamīrĕ
vĕlaya nābai seyi veyam̐gānu
kaligi śhrīveṁkaḍeśha kāyamu lŏkkaḍi yāya
sŏlabu radula nannum̐ jŏkkiṁcham̐gānu