ఇంత చాలదా నాకు యేమిసేసుఁ జలములు
(॥పల్లవి॥)
ఇంత చాలదా నాకు యేమిసేసుఁ జలములు
పంతగాఁడు తా నిట్లా బతికితేఁ జాలును
(॥ఇంత॥)
పిలువఁగనేల తన్ను బిగిసితేఁ దిట్టనేల
కలఁడుగా మాకుఁ దానే కలకాలము
చలివాసె వేయిటిపై జవ్వాదికొమ్మువలె
తొలుతటిచెలులలో తొరలివుందానను
(॥ఇంత॥)
తనతోడిమాటలేల తప్పితేఁ గోపించనేల
మనసున నున్నదిగా మామీఁదిమేలు
మునుకొని తనకు నే ముద్రలోనిసొమ్మువలె
తనవనితలలోన తగిలివుందానను
(॥ఇంత॥)
మొగము చూడనేల తా మొక్కితే దీవించనేల
అగపడి కూడెఁగా తా నప్పుడే నన్ను
జిగి శ్రీవేంకటేశుముఁజేతికంకణమువలె
తగుఁబట్టపు దేవులదండనే వుందానను
(||pallavi||)
iṁta sāladā nāgu yemisesum̐ jalamulu
paṁtagām̐ḍu tā niṭlā badigidem̐ jālunu
(||iṁta||)
piluvam̐ganela tannu bigisidem̐ diṭṭanela
kalam̐ḍugā māgum̐ dāne kalagālamu
salivāsĕ veyiḍibai javvādigŏmmuvalĕ
tŏludaḍisĕlulalo tŏralivuṁdānanu
(||iṁta||)
tanadoḍimāḍalela tappidem̐ gobiṁchanela
manasuna nunnadigā māmīm̐dimelu
munugŏni tanagu ne mudralonisŏmmuvalĕ
tanavanidalalona tagilivuṁdānanu
(||iṁta||)
mŏgamu sūḍanela tā mŏkkide dīviṁchanela
agabaḍi kūḍĕm̐gā tā nappuḍe nannu
jigi śhrīveṁkaḍeśhumum̐jedigaṁkaṇamuvalĕ
tagum̐baṭṭabu devuladaṁḍane vuṁdānanu