ఇంత చాలదా మరి యేమైననాయఁ గాని
(॥పల్లవి॥)
ఇంత చాలదా మరి యేమైననాయఁ గాని
వంతులు వాసులు నందే వక్కణించఁ గంటిఁగా
(॥ఇంత॥)
చూచినచూపులలోన చురుకన్నా ననెఁగాని
కాచినమోవి కెంపైనాఁ గంటిఁగా నేను
వేచినచిరునవ్వులు వేఁడైనా నాయఁగాని
చేచేతనే సిగ్గు చేవదేరఁ గంటిఁగా
(॥ఇంత॥)
వారింపులమాటలలో వాండ్లయినా నాయఁగాని
తీరైనగొణములెల్లఁ దెలిసితిఁగా
వేరులేని మొక్కులలో వెంగెమైనా నాయఁగాని
నారుకొన్నపులకల నములైనాఁ గంటిఁగా
(॥ఇంత॥)
పట్టినకైదండలోనె పచ్చయినా నాయఁగాని
చిట్టంటు చేఁతలు మేనఁ జేయఁగంటిఁగా
గుట్టుగా శ్రీవేంకటేశ కూడినాఁ గూడితిఁగాని
వొట్టులు సత్యాలు నీచే నొనరించఁగంటిఁగా
(||pallavi||)
iṁta sāladā mari yemainanāyam̐ gāni
vaṁtulu vāsulu naṁde vakkaṇiṁcham̐ gaṁṭim̐gā
(||iṁta||)
sūsinasūbulalona surugannā nanĕm̐gāni
kāsinamovi kĕṁpainām̐ gaṁṭim̐gā nenu
vesinasirunavvulu vem̐ḍainā nāyam̐gāni
sesedane siggu sevaderam̐ gaṁṭim̐gā
(||iṁta||)
vāriṁpulamāḍalalo vāṁḍlayinā nāyam̐gāni
tīrainagŏṇamulĕllam̐ dĕlisidim̐gā
veruleni mŏkkulalo vĕṁgĕmainā nāyam̐gāni
nārugŏnnabulagala namulainām̐ gaṁṭim̐gā
(||iṁta||)
paṭṭinagaidaṁḍalonĕ pachchayinā nāyam̐gāni
siṭṭaṁṭu sem̐talu menam̐ jeyam̐gaṁṭim̐gā
guṭṭugā śhrīveṁkaḍeśha kūḍinām̐ gūḍidim̐gāni
vŏṭṭulu satyālu nīse nŏnariṁcham̐gaṁṭim̐gā