Imta rattu sesemaa yippudu ne mellaanu

ఇంత రట్టు సేసేమా యిప్పుడు నే మెల్లాను
Language

(॥పల్లవి॥)
ఇంత రట్టు సేసేమా యిప్పుడు నే మెల్లాను
పంతగత్తెయై నీతోఁ బలిమిఁ బెనఁగీని

(॥ఇంత॥)
పలుమారు నవ్వుకొంటాఁ బగటులు చూపుకొంటా
చెలుములు సేసీని చెలి నీతోను
కొలువులు సేయుచును కూరిమి గొసరుచు
వలపులు చల్లి నీవద్దఁ గాచుకున్నది

(॥ఇంత॥)
తప్పక చూచుకొంటా తరితీపు చేసుకొంటా
అప్పటి మేకులు సేసీ నంగన నీతో
కప్పురాన వేయుచును కానుక లొసఁగుచును
ముప్పిరి నాసాసల మోవి చూపీ నీకును

(॥ఇంత॥)
శిర సూచి మెచ్చుకొంటా చేతులు పైఁ జాచుకొంటా
మురిపెము వచరించీ ముదిత నీతో
ఇరవై శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టె
సరుగ నీరతులలో సాము సేసీఁ దాను

(||pallavi||)
iṁta raṭṭu sesemā yippuḍu ne mĕllānu
paṁtagattĕyai nīdom̐ balimim̐ bĕnam̐gīni

(||iṁta||)
palumāru navvugŏṁṭām̐ bagaḍulu sūbugŏṁṭā
sĕlumulu sesīni sĕli nīdonu
kŏluvulu seyusunu kūrimi gŏsarusu
valabulu salli nīvaddam̐ gāsugunnadi

(||iṁta||)
tappaga sūsugŏṁṭā taridību sesugŏṁṭā
appaḍi megulu sesī naṁgana nīdo
kappurāna veyusunu kānuga lŏsam̐gusunu
muppiri nāsāsala movi sūbī nīgunu

(||iṁta||)
śhira sūsi mĕchchugŏṁṭā sedulu paim̐ jāsugŏṁṭā
muribĕmu vasariṁchī mudida nīdo
iravai śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭĕ
saruga nīradulalo sāmu sesīm̐ dānu