Imta pani kobudumaa yidivo nemo

ఇంత పని కోపుదుమా యిదివో నేమొ
Language

(॥పల్లవి॥)
ఇంత పని కోపుదుమా యిదివో నేమొ
మంతనానకు వచ్చితే మరిగించుకొంటివి

(॥॥)
పొద్దువోనివాఁడవు పొలఁతులఁ గంటేను
చద్దికి వేఁడి కాడేవు జాణతనాలు
వుద్దండీఁడవట మీఁద నొడఁబరచవచ్చితే
కొద్దిమీరి చెలిమేన గొరు దాఁకించితివి

(॥॥)
జూటరివాఁడవు నీవు సదుతు లిచ్చి తేఁజాలు
చీటికిమాటి కంటేవు చేకానికలు
నీటుదొరవు గనక నీతు విందుచెప్ప వచ్చి
నాఁటదానికొంగువట్టి యాఱడిఁ బెట్టేవు

(॥॥)
నిరతి శ్రీ వేంకటేశ నెలఁత లెదుట నుంటే
సరికి బేసి కంటేవు చనుమొనలు
సరసుఁడవని నిన్ను సంగడి నే మెచ్చితేను
సొరిది నన్నేలితివి చుట్టమైనదానిని

(||pallavi||)
iṁta pani kobudumā yidivo nemŏ
maṁtanānagu vachchide marigiṁchugŏṁṭivi

(||||)
pŏdduvonivām̐ḍavu pŏlam̐tulam̐ gaṁṭenu
saddigi vem̐ḍi kāḍevu jāṇadanālu
vuddaṁḍīm̐ḍavaḍa mīm̐da nŏḍam̐barasavachchide
kŏddimīri sĕlimena gŏru dām̐kiṁchidivi

(||||)
jūḍarivām̐ḍavu nīvu sadudu lichchi tem̐jālu
sīḍigimāḍi kaṁṭevu segānigalu
nīḍudŏravu ganaga nīdu viṁdusĕppa vachchi
nām̐ṭadānigŏṁguvaṭṭi yāṟaḍim̐ bĕṭṭevu

(||||)
niradi śhrī veṁkaḍeśha nĕlam̐ta lĕduḍa nuṁṭe
sarigi besi kaṁṭevu sanumŏnalu
sarasum̐ḍavani ninnu saṁgaḍi ne mĕchchidenu
sŏridi nannelidivi suṭṭamainadānini