ఇంట నున్నవారము నే మెందు వొయ్యేము
(॥పల్లవి॥)
ఇంట నున్నవారము నే మెందు వొయ్యేము
దంటలమై నిన్ను నేము తప్పు వట్టేమా
(॥ఇంట॥)
నివ్వటిల్ల నీకన్నుల నిద్దుర దొట్టి వున్నది
పవ్వళించ రాదా పానుపుమీఁద
చివ్వన న న్నేల నీవు చేయి వట్టి తీసేవు
దవ్వుల మాతోడిపొందు తప్పి పోయినా
(॥ఇంట॥)
ఆసురుసు రెల్లా నీయంగముపైనే వున్నది
విసరించుకో రాదా వేగినంతాను
రసికుఁడ మ మ్మేల రతికిఁ బిలిపించేవు
వెస నెప్పు డైనా నిన్ను వెగ్గళించేమా
(॥ఇంట॥)
వేడుకలు నీ కెపుడు వెల్లివిరిసి వున్నవి
వీడె మింద రాదా వెర పేఁటికి
ఆడెనె శ్రీవెంకటేశ అలమేల్ మంగను నన్ను
కూడితివి యిఁక నీకు గురి దప్పీనా
(||pallavi||)
iṁṭa nunnavāramu ne mĕṁdu vŏyyemu
daṁṭalamai ninnu nemu tappu vaṭṭemā
(||iṁṭa||)
nivvaḍilla nīgannula niddura dŏṭṭi vunnadi
pavvaḽiṁcha rādā pānubumīm̐da
sivvana na nnela nīvu seyi vaṭṭi tīsevu
davvula mādoḍibŏṁdu tappi poyinā
(||iṁṭa||)
āsurusu rĕllā nīyaṁgamubaine vunnadi
visariṁchugo rādā veginaṁtānu
rasigum̐ḍa ma mmela radigim̐ bilibiṁchevu
vĕsa nĕppu ḍainā ninnu vĕggaḽiṁchemā
(||iṁṭa||)
veḍugalu nī kĕbuḍu vĕllivirisi vunnavi
vīḍĕ miṁda rādā vĕra pem̐ṭigi
āḍĕnĕ śhrīvĕṁkaḍeśha alamel maṁganu nannu
kūḍidivi yim̐ka nīgu guri dappīnā