Imta nishtoora memtige yeduda neegu

ఇంత నిష్టూర మేఁటికే యెదుట నీకు
Language

(॥పల్లవి॥)
ఇంత నిష్టూర మేఁటికే యెదుట నీకు
కొంత మొగమోట వద్దా కొసరేవు నీవు

(॥॥)
చెప్పుడు మాటలకే చెలువుని నింతేసి
పుప్పటించఁ దగునటే వోయమ్మ నీవు
కప్పుర మాతఁడిచ్చి గారవించఁగా నిన్ను
తప్పులెంచ వచ్చునటే తమకించి నీవు

(॥॥)
నగిన యంతటిలోనే ననుపు విచారించక
మొగము వంతురటవే ముదిత నీవు
అగపడి కస్తూరి నీయంగములఁ బూయఁగా
వెగటున విదిలించి వేతురటవే

(॥॥)
జీర మేన నున్నందుకే శ్రీవేంకటేశ్వరుని
నేరములెంతు రటవే నెట్టుక నీవు
గారవించితఁడే నిన్నుఁ గాఁగిలించి కూడఁగాను
పేరిడి సిగ్గులు ఇంకఁ బెంతురటే నీవు

(||pallavi||)
iṁta niṣhṭūra mem̐ṭige yĕduḍa nīgu
kŏṁta mŏgamoḍa vaddā kŏsarevu nīvu

(||||)
sĕppuḍu māḍalage sĕluvuni niṁtesi
puppaḍiṁcham̐ dagunaḍe voyamma nīvu
kappura mādam̐ḍichchi gāraviṁcham̐gā ninnu
tappulĕṁcha vachchunaḍe tamagiṁchi nīvu

(||||)
nagina yaṁtaḍilone nanubu visāriṁchaga
mŏgamu vaṁturaḍave mudida nīvu
agabaḍi kastūri nīyaṁgamulam̐ būyam̐gā
vĕgaḍuna vidiliṁchi veduraḍave

(||||)
jīra mena nunnaṁduge śhrīveṁkaḍeśhvaruni
neramulĕṁtu raḍave nĕṭṭuga nīvu
gāraviṁchidam̐ḍe ninnum̐ gām̐giliṁchi kūḍam̐gānu
periḍi siggulu iṁkam̐ bĕṁturaḍe nīvu