Imta ninnum jesinaadam demtajaanamde

ఇంత నిన్నుఁ జేసినాతఁ డెంతజాణఁడే
Language

(॥పల్లవి॥)
ఇంత నిన్నుఁ జేసినాతఁ డెంతజాణఁడే
సంతోసాలు చెప్పఁగదె సరుగ నోచెలియా

(॥ఇంత॥)
చెక్కులఁ జారుఁదురుము చెంపలనూరేచెమట
యెక్కడఁ గలిగేనే యింతలో నీకు
చొక్కిటి కరఁగులును చూపులలొ మెరుఁగులు
పక్కన నీమేన నిండె బాగాయనే

(॥ఇంత॥)
మోవివసినాడులు మంచినచిరునవ్వులు
యేవిదాన నీవు గడియించుకొంటివే
చేవదేరేచెనకులు చిట్లుగందములును
సొవసొవసిగ్గులును సొదగాయనే

(॥ఇంత॥)
వింతవింతవాసనలు వేడుకమోముకళలు
యింతలో నెట్టువచ్చెనే యివిగో నీకు
చెంత నిన్నుఁ గాగిలించె శ్రీవేంకటేశ్వరుఁడు
పంతాన నీతని పొందుపట్లు లాగాయనే

(||pallavi||)
iṁta ninnum̐ jesinādam̐ ḍĕṁtajāṇam̐ḍe
saṁtosālu sĕppam̐gadĕ saruga nosĕliyā

(||iṁta||)
sĕkkulam̐ jārum̐durumu sĕṁpalanūresĕmaḍa
yĕkkaḍam̐ galigene yiṁtalo nīgu
sŏkkiḍi karam̐gulunu sūbulalŏ mĕrum̐gulu
pakkana nīmena niṁḍĕ bāgāyane

(||iṁta||)
movivasināḍulu maṁchinasirunavvulu
yevidāna nīvu gaḍiyiṁchugŏṁṭive
sevaderesĕnagulu siṭlugaṁdamulunu
sŏvasŏvasiggulunu sŏdagāyane

(||iṁta||)
viṁtaviṁtavāsanalu veḍugamomugaḽalu
yiṁtalo nĕṭṭuvachchĕne yivigo nīgu
sĕṁta ninnum̐ gāgiliṁchĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
paṁtāna nīdani pŏṁdubaṭlu lāgāyane