ఇంత నేరమే నేము యిచ్చకములే సేతుము
(॥పల్లవి॥)
ఇంత నేరమే నేము యిచ్చకములే సేతుము
చెంతలనే కిందుపరచితివే విభుని
(॥ఇంత॥)
మొక్కలాన నదలించి మొనచూపులనుఁ జూచి
వెక్కసాన వంచుకొంటివే పతిని
చక్కనిగోరు మోఁపి చలములు సాదించి
గుక్కక యిన్నిటాఁ బనిగొంటివే విభుని
(॥ఇంత॥)
పొరలింపు మాటలాడి బొమ్మలను జంకించి
వెరసుగ సాదించితివే విభుని
తెరమరఁగుకుఁ దీసి దీకొని చన్నులనొత్తి
గురుసు మోవ లోఁజేకొంటివే విభుని
(॥ఇంత॥)
కలకల నవ్వు నవ్వి గక్కననుఁ గాఁగిలించి
కలిసితివే శ్రీ వేంకటవిభుని
అలపులెల్లాఁ దీరిచి అట్టె మర్మములంటి
కొలిపి మమ్మేలించి చేకొంటివే విభుని
(||pallavi||)
iṁta nerame nemu yichchagamule sedumu
sĕṁtalane kiṁdubarasidive vibhuni
(||iṁta||)
mŏkkalāna nadaliṁchi mŏnasūbulanum̐ jūsi
vĕkkasāna vaṁchugŏṁṭive padini
sakkanigoru mom̐pi salamulu sādiṁchi
gukkaga yinniḍām̐ banigŏṁṭive vibhuni
(||iṁta||)
pŏraliṁpu māḍalāḍi bŏmmalanu jaṁkiṁchi
vĕrasuga sādiṁchidive vibhuni
tĕramaram̐gugum̐ dīsi dīgŏni sannulanŏtti
gurusu mova lom̐jegŏṁṭive vibhuni
(||iṁta||)
kalagala navvu navvi gakkananum̐ gām̐giliṁchi
kalisidive śhrī veṁkaḍavibhuni
alabulĕllām̐ dīrisi aṭṭĕ marmamulaṁṭi
kŏlibi mammeliṁchi segŏṁṭive vibhuni