Imta neragunnavaamde yinnidaam goola

ఇంత నేరకున్నవాఁడె యిన్నిటాఁ గూళ
Language

(॥పల్లవి॥)
ఇంత నేరకున్నవాఁడె యిన్నిటాఁ గూళ
వంతు వాసు లెంచకుండేవాఁడె జాణ

(॥ఇంత॥)
కూరిమితో నాఁడువారు కోపగించినట్టివేళ
వైరము లేక నవ్వెటివాఁడు వో జాణ
ఆరయ నలుకతోడ నట్టె యంత దిట్టినాను
గారవించి వేడుకొన్నఘనుఁడు వో జాణ

(॥ఇంత॥)
అలిగి ప్రాణేశ్వరి అవ్వలిమో మైనవేళ
వలపుతో బుజ్జగించేవాఁడు వో జాణ
చలి వేఁడి సిగ్గుతోడ సటలకు బిగియఁగా
బలిమి సేసి పైకొన్న పతియ పో జాణ

(॥ఇంత॥)
అల్లప్పుడే రావైతి మని సాదించేవేళ
వల్లె వేసి చెక్కు నొక్కేవాఁడె జాణ
వెల్లవిరి గాఁగ శ్రీవెంకటేశ కూడితివి
చల్లని నీవంటి మంచి సరసుఁడే జాణ

(||pallavi||)
iṁta neragunnavām̐ḍĕ yinniḍām̐ gūḽa
vaṁtu vāsu lĕṁchaguṁḍevām̐ḍĕ jāṇa

(||iṁta||)
kūrimido nām̐ḍuvāru kobagiṁchinaṭṭiveḽa
vairamu lega navvĕḍivām̐ḍu vo jāṇa
āraya nalugadoḍa naṭṭĕ yaṁta diṭṭinānu
gāraviṁchi veḍugŏnnaghanum̐ḍu vo jāṇa

(||iṁta||)
aligi prāṇeśhvari avvalimo mainaveḽa
valabudo bujjagiṁchevām̐ḍu vo jāṇa
sali vem̐ḍi siggudoḍa saḍalagu bigiyam̐gā
balimi sesi paigŏnna padiya po jāṇa

(||iṁta||)
allappuḍe rāvaidi mani sādiṁcheveḽa
vallĕ vesi sĕkku nŏkkevām̐ḍĕ jāṇa
vĕllaviri gām̐ga śhrīvĕṁkaḍeśha kūḍidivi
sallani nīvaṁṭi maṁchi sarasum̐ḍe jāṇa