Imta neragumdina nademti yimti

ఇంత నేరకుండిన నదేఁటి యింతి
Language

(॥పల్లవి॥)
ఇంత నేరకుండిన నదేఁటి యింతి
వింతచెలుల నెరపు విడిపించే దింతి

(॥ఇంత॥)
తనిసిన మగవాని తమిరేఁ చినదే యింతి
కొనగోరిసోఁకు లియ్యకొనఁ జేసినదే యింతి
కనుమూయించి నిద్దురకలలోఁ గూడిన దింతి
తననేరుపుపిమ్మటఁ దలఁపించే దింతి

(॥ఇంత॥)
కూడి తెల్లవారుటకు గుండె బెదరించే దింతి
ఆడఁ జేయరాని వినయాలు సేయించే దింతి
వాడుమోముతనుఁ గంటివడిఁగళ రేఁచే దింతి
జోడువాసినఁ గన్నీరు జొబ్బిలించే దింతి

(॥ఇంత॥)
వన్నెప్రాయము తనకే వ్రతము పట్టించే దింతి
యెన్నికె నిక్కువనుండి యెదురు చూపించే దింతి
యిన్నిటా శ్రీవేంకంటేశు నిట్లానే చేసి కూడె
నెన్నఁగ నలమేల్మంగ యీకెపో యింతి

(||pallavi||)
iṁta neraguṁḍina nadem̐ṭi yiṁti
viṁtasĕlula nĕrabu viḍibiṁche diṁti

(||iṁta||)
tanisina magavāni tamirem̐ sinade yiṁti
kŏnagorisom̐ku liyyagŏnam̐ jesinade yiṁti
kanumūyiṁchi nidduragalalom̐ gūḍina diṁti
tananerububimmaḍam̐ dalam̐piṁche diṁti

(||iṁta||)
kūḍi tĕllavāruḍagu guṁḍĕ bĕdariṁche diṁti
āḍam̐ jeyarāni vinayālu seyiṁche diṁti
vāḍumomudanum̐ gaṁṭivaḍim̐gaḽa rem̐se diṁti
joḍuvāsinam̐ gannīru jŏbbiliṁche diṁti

(||iṁta||)
vannĕprāyamu tanage vradamu paṭṭiṁche diṁti
yĕnnigĕ nikkuvanuṁḍi yĕduru sūbiṁche diṁti
yinniḍā śhrīveṁkaṁṭeśhu niṭlāne sesi kūḍĕ
nĕnnam̐ga nalamelmaṁga yīgĕbo yiṁti