Imta neragumdide nee vela vachchevu

ఇంత నేరకుండితే నీ వేల వచ్చేవు
Language

(॥పల్లవి॥)
ఇంత నేరకుండితే నీ వేల వచ్చేవు
వింత వింత వగ లెల్ల వింటిఁ గంటిరా

(॥ఇంత॥)
వాలుక రెప్పలు నే వంచిన మాత్రములోనె
నాలికాఁడ నీ తనువు నాఁటె ననేవు
యీలాగు మాట లాడి యిచ్చకాలు సేసుక
కాల మెల్ల బతికితి కానీ కానీరా

(॥ఇంత॥)
చల్లఁగా నే గందవొడి చల్లిన మాత్రములోనె
పల్లదాన తల దిమ్ము పట్టె ననేవు
కల్ల గాదు యింత మాయకాఁడవు గాకుండితేను
యెల్లవారిలోన నేఁడు యెట్టు వేగించేవురా

(॥ఇంత॥)
కొంకక నీ తొడమీఁద గూచున్న మాత్రములోనె
అంకెల నీ కళ దాఁకె నని అనేవు
సంకె లేక నీ వింతేసి జాణవు గాకుండితేను
పొంకపు శ్రీవెంకటేశ పొంచి నన్నుఁ గూడేవా

(||pallavi||)
iṁta neraguṁḍide nī vela vachchevu
viṁta viṁta vaga lĕlla viṁṭim̐ gaṁṭirā

(||iṁta||)
vāluga rĕppalu ne vaṁchina mātramulonĕ
nāligām̐ḍa nī tanuvu nām̐ṭĕ nanevu
yīlāgu māḍa lāḍi yichchagālu sesuga
kāla mĕlla badigidi kānī kānīrā

(||iṁta||)
sallam̐gā ne gaṁdavŏḍi sallina mātramulonĕ
palladāna tala dimmu paṭṭĕ nanevu
kalla gādu yiṁta māyagām̐ḍavu gāguṁḍidenu
yĕllavārilona nem̐ḍu yĕṭṭu vegiṁchevurā

(||iṁta||)
kŏṁkaga nī tŏḍamīm̐da gūsunna mātramulonĕ
aṁkĕla nī kaḽa dām̐kĕ nani anevu
saṁkĕ lega nī viṁtesi jāṇavu gāguṁḍidenu
pŏṁkabu śhrīvĕṁkaḍeśha pŏṁchi nannum̐ gūḍevā