ఇంత నీవు సేసేది యెరఁగనైతి
(॥పల్లవి॥)
ఇంత నీవు సేసేది యెరఁగనైతి
వింత నీవు గావంటా విఱ్ఱవీఁగితిఁగా
(॥ఇంత॥)
వేడుకతో మాయింటికి విచ్చేసేవంటానే
ఆడుకొంటి నిందరితో నాసలాసల
వీడెము నేనిచ్చేనంటా విందు నీకుఁ బెట్టేనంటా
యేడలేని సంబ్రమాన నెదురు చూచితిఁగా
(॥ఇంత॥)
పంతాన నీవు నన్ను భావించి చూచేవంటా
ఇంత సింగారించుకొంటి నిందరిలోన
మంతనమాడేనంటా మచ్చిక చూపేనంటా
సంతసాన నీకు నే జాగరాన నుంటిఁగా
(॥ఇంత॥)
బడలి వచ్చి నావొద్దఁ బవ్వళించేవంటాను
కడఁగి పానుపువేసి కాచుకుండితి
అడరి శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
వుడివోక యిందాఁకా నొంటినే వుండితిఁగా
(||pallavi||)
iṁta nīvu sesedi yĕram̐ganaidi
viṁta nīvu gāvaṁṭā viṭravīm̐gidim̐gā
(||iṁta||)
veḍugado māyiṁṭigi vichchesevaṁṭāne
āḍugŏṁṭi niṁdarido nāsalāsala
vīḍĕmu nenichchenaṁṭā viṁdu nīgum̐ bĕṭṭenaṁṭā
yeḍaleni saṁbramāna nĕduru sūsidim̐gā
(||iṁta||)
paṁtāna nīvu nannu bhāviṁchi sūsevaṁṭā
iṁta siṁgāriṁchugŏṁṭi niṁdarilona
maṁtanamāḍenaṁṭā machchiga sūbenaṁṭā
saṁtasāna nīgu ne jāgarāna nuṁṭim̐gā
(||iṁta||)
baḍali vachchi nāvŏddam̐ bavvaḽiṁchevaṁṭānu
kaḍam̐gi pānubuvesi kāsuguṁḍidi
aḍari śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
vuḍivoga yiṁdām̐kā nŏṁṭine vuṁḍidim̐gā