Imta neevu mannimchuda yimdugaa nannu

ఇంత నీవు మన్నించుట యిందుకా నన్ను
Language

(॥పల్లవి॥)
ఇంత నీవు మన్నించుట యిందుకా నన్ను
వింతవారిఁ బతి వెట్ట వేడుకా నీకు

(॥ఇంత॥)
ఆపె నన్ను నాడఁగా నే నాపెతో వా దడువఁగ
యేపున వినేవు నీకు యేమి గూడెరా
వోపి కల్ల గలవారి నొద్దంటే దోసమా
చేపట్టి నీ కేమి పగ సేసితిరా నేనూ

(॥ఇంత॥)
సవతి పగ చాటఁగ సారె నేఁ బగ చాటఁగా
భువిలోఁ జూచేది నీకుఁ బుణ్యమా నేఁడు
వివరించి మా మొర విచారించఁ దగదా
కవ కవ నవ్వి నవ్వి గండి గట్టుకొంటివా

(॥ఇంత॥)
చేతు లాపె చాఁచఁగాను చేరి నే నొట్టు వెట్టఁగ
యీతల నడ్డము రావు యిదె తగునా
జాతిగ శ్రీవెంకటేశ చన విచ్చితివి నాకు
యేతుల నిన్నుఁ గూడితి యిక నేల మరఁగూ

(||pallavi||)
iṁta nīvu manniṁchuḍa yiṁdugā nannu
viṁtavārim̐ badi vĕṭṭa veḍugā nīgu

(||iṁta||)
ābĕ nannu nāḍam̐gā ne nābĕdo vā daḍuvam̐ga
yebuna vinevu nīgu yemi gūḍĕrā
vobi kalla galavāri nŏddaṁṭe dosamā
sebaṭṭi nī kemi paga sesidirā nenū

(||iṁta||)
savadi paga sāḍam̐ga sārĕ nem̐ baga sāḍam̐gā
bhuvilom̐ jūsedi nīgum̐ buṇyamā nem̐ḍu
vivariṁchi mā mŏra visāriṁcham̐ dagadā
kava kava navvi navvi gaṁḍi gaṭṭugŏṁṭivā

(||iṁta||)
sedu lābĕ sām̐sam̐gānu seri ne nŏṭṭu vĕṭṭam̐ga
yīdala naḍḍamu rāvu yidĕ tagunā
jādiga śhrīvĕṁkaḍeśha sana vichchidivi nāgu
yedula ninnum̐ gūḍidi yiga nela maram̐gū