Imta neemohamu neneramganaidim gaaga

ఇంత నీమోహము నేనెరఁగనైతిఁ గాక
Language

(॥పల్లవి॥)
ఇంత నీమోహము నేనెరఁగనైతిఁ గాక
సంతసము నీకెపుడు సహజమే కాదా

(॥ఇంత॥)
చెంగటనే నిలుచుండి చెక్కునొక్కేవిదే నన్ను
పొంగుచు నీకెంతదయ పుట్టెనో నేఁడు
కొంగువట్టి తీసి నన్నుఁ గూచుండఁ బెట్టుకొంటివి
పంగెనల నాపైనెంత పారెనో మనసు

(॥ఇంత॥)
ఇందరిలోపల నన్ను నెక్కుడుగా మన్నించితి
కందువ నాతలఁపెట్టు గంటివో నీవు
పొందుల సరసమాడి బుజ్జగించేవట్టేనన్ను
చందముగ నెటువంటి జాణవో నీవు

(॥ఇంత॥)
శిరసు నాపై మోపి సెలవి నవ్వేవు నీవు
ధర నాపైనీకెంత తగులో నేఁడు
యిరవై శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
తరలకెంత మన్నించి దక్కితివొ నీవు

(||pallavi||)
iṁta nīmohamu nenĕram̐ganaidim̐ gāga
saṁtasamu nīgĕbuḍu sahajame kādā

(||iṁta||)
sĕṁgaḍane nilusuṁḍi sĕkkunŏkkevide nannu
pŏṁgusu nīgĕṁtadaya puṭṭĕno nem̐ḍu
kŏṁguvaṭṭi tīsi nannum̐ gūsuṁḍam̐ bĕṭṭugŏṁṭivi
paṁgĕnala nābainĕṁta pārĕno manasu

(||iṁta||)
iṁdarilobala nannu nĕkkuḍugā manniṁchidi
kaṁduva nādalam̐pĕṭṭu gaṁṭivo nīvu
pŏṁdula sarasamāḍi bujjagiṁchevaṭṭenannu
saṁdamuga nĕḍuvaṁṭi jāṇavo nīvu

(||iṁta||)
śhirasu nābai mobi sĕlavi navvevu nīvu
dhara nābainīgĕṁta tagulo nem̐ḍu
yiravai śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
taralagĕṁta manniṁchi dakkidivŏ nīvu