ఇంత నీకు వెఱపేల ఇద్దరిఁ గన్నులఁ గంటి
(॥పల్లవి॥)
ఇంత నీకు వెఱపేల ఇద్దరిఁ గన్నులఁ గంటి
యెంతైనా నీ హితవే ఇటు నా హితవురా
(॥॥)
యెవ్వతెకు నీవు మోహించి వుండినాను
నివ్వటిల్ల నాకె నాకు నీమాదే
జవ్వనియెవ్వతెతోడ సారె నీవు నవ్వినాను
నవ్వుగాదు అది నీవు నాతో నవ్వుతరా
(॥॥)
ఇద్దరు మీ రేకతాన నేమి మాటలాడుకొన్నా
ముద్దుల నవి నాతోడి ముచ్చటలురా
గద్దించి యెవ్వతె నిన్నుఁ గాగిలించుకొన్నాను
కొద్దిమీరినట్టివే నాకూటములురా
(॥॥)
చెక్కునొక్కి యెవ్వతైనాఁ జేఁత నిన్నుఁజేసినాను
అక్కరతో నాచేఁత లవియెల్లారా
ఇక్కువతో శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
నిక్కముగ వారెల్లా నే నొకతెనేరా
(||pallavi||)
iṁta nīgu vĕṟabela iddarim̐ gannulam̐ gaṁṭi
yĕṁtainā nī hidave iḍu nā hidavurā
(||||)
yĕvvadĕgu nīvu mohiṁchi vuṁḍinānu
nivvaḍilla nāgĕ nāgu nīmāde
javvaniyĕvvadĕdoḍa sārĕ nīvu navvinānu
navvugādu adi nīvu nādo navvudarā
(||||)
iddaru mī regadāna nemi māḍalāḍugŏnnā
muddula navi nādoḍi muchchaḍalurā
gaddiṁchi yĕvvadĕ ninnum̐ gāgiliṁchugŏnnānu
kŏddimīrinaṭṭive nāgūḍamulurā
(||||)
sĕkkunŏkki yĕvvadainām̐ jem̐ta ninnum̐jesinānu
akkarado nāsem̐ta laviyĕllārā
ikkuvado śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
nikkamuga vārĕllā ne nŏgadĕnerā