ఇంత నీకు వేఁగా యిటు నే వలచినది
(॥పల్లవి॥)
ఇంత నీకు వేఁగా యిటు నే వలచినది
పంతాన నీ సుద్ది వింటే పరులెల్ల మెత్తురా
(॥ఇంత॥)
బలిమిలో నే నీకు పట్టపుదేవులనై
చెలులకెల్లఁ బ్రియము చెప్పఁ గలనా
చిలుకలతో కాకుల చెంది మాటలాడించితే
వలవంతఁ జూచినవారెల్ల నగరా
(॥ఇంత॥)
వొక్కగద్దెమీఁద నీవొద్దనే కూచుండి
మొక్కలపుసతులను మొక్కఁగలనా
గక్కున మాణికము గాజు భరణిఁ బెట్టితే
తక్కువవునా అది నీ తప్పందురు గాక
(॥ఇంత॥)
యివల శ్రీవేంకటేశ యిటు నీకాఁగిటఁ గూడి
సవతుల సరియై యెంచఁగఁ గలనా
భువినేనుఁగ దోమను పూఁచి లంకెఁ బెట్టితేను
వివరించనది నీ వెలితే కాదా
(||pallavi||)
iṁta nīgu vem̐gā yiḍu ne valasinadi
paṁtāna nī suddi viṁṭe parulĕlla mĕtturā
(||iṁta||)
balimilo ne nīgu paṭṭabudevulanai
sĕlulagĕllam̐ briyamu sĕppam̐ galanā
silugalado kāgula sĕṁdi māḍalāḍiṁchide
valavaṁtam̐ jūsinavārĕlla nagarā
(||iṁta||)
vŏkkagaddĕmīm̐da nīvŏddane kūsuṁḍi
mŏkkalabusadulanu mŏkkam̐galanā
gakkuna māṇigamu gāju bharaṇim̐ bĕṭṭide
takkuvavunā adi nī tappaṁduru gāga
(||iṁta||)
yivala śhrīveṁkaḍeśha yiḍu nīgām̐giḍam̐ gūḍi
savadula sariyai yĕṁcham̐gam̐ galanā
bhuvinenum̐ga domanu pūm̐si laṁkĕm̐ bĕṭṭidenu
vivariṁchanadi nī vĕlide kādā