ఇంత మాత్రము మా నేమ మిందు నీ కేమి గూడీని
(॥పల్లవి॥)
ఇంత మాత్రము మా నేమ మిందు నీ కేమి గూడీని
చెంత ధర్మమునకు రక్షించేవు నీవు నన్ను
(॥ఇంత॥)
పిడికెఁడు బియ్యమే పెద్దరికంబగు చెలిమి
తొడిఁబడ సంధ్య మూఁడుదోసిళ్లు నీళ్లు
నుడిగే జపము వేళ్ల నూఁటయెనిమి దెంచేది
తడుపుకొనేది తీర్థస్నానము లన్నియును
(॥ఇంత॥)
వూరక యాకలి గొని వుండేది మా వ్రతములు
నీరసపు టాహారాలు నిష్టలెల్లాను
వూరఁ దోఁటల పువ్వు లొగి దేవపూజలు
గోరమైన బతుకులు కోరేటి తపములు
(॥ఇంత॥)
బలసాకు తిలలు దర్భలు పితృపూజలు
పలుకకుండేది మా బలు మోసము
యిలపై శ్రీవేంకటేశ యిందు నిన్న మెప్పించే మా
కలిగినది మాకు నిఁక మణి కాకా
(||pallavi||)
iṁta mātramu mā nema miṁdu nī kemi gūḍīni
sĕṁta dharmamunagu rakṣhiṁchevu nīvu nannu
(||iṁta||)
piḍigĕm̐ḍu biyyame pĕddarigaṁbagu sĕlimi
tŏḍim̐baḍa saṁdhya mūm̐ḍudosiḽlu nīḽlu
nuḍige jabamu veḽla nūm̐ṭayĕnimi dĕṁchedi
taḍubugŏnedi tīrdhasnānamu lanniyunu
(||iṁta||)
vūraga yāgali gŏni vuṁḍedi mā vradamulu
nīrasabu ṭāhārālu niṣhṭalĕllānu
vūram̐ dom̐ṭala puvvu lŏgi devabūjalu
goramaina badugulu koreḍi tabamulu
(||iṁta||)
balasāgu tilalu darbhalu pitṛpūjalu
palugaguṁḍedi mā balu mosamu
yilabai śhrīveṁkaḍeśha yiṁdu ninna mĕppiṁche mā
kaliginadi māgu nim̐ka maṇi kāgā