Imta kobamgalanaa yidu needom bomdusesi

ఇంత కోపఁగలనా యిటు నీతోఁ బొందుసేసి
Language

(॥పల్లవి॥)
ఇంత కోపఁగలనా యిటు నీతోఁ బొందుసేసి
మంతనాలు చాలుఁ జాలు మాయలు నీ విద్య

(॥ఇంత॥)
మూలఁ బుడిసెడునీట మునిఁగేది నీ విద్య
తాలిమి వీఁవు గానరా దాఁగేది నీ విద్య
జోలి దవ్వి యెడలేని సూకరాలు నీ విద్య
పాలఁసుడవై మానుపడేది నీవిద్య

(॥ఇంత॥)
కొంకక వేలు వె ట్టిమ్ముగొనేది నీ విద్య
జంకెతో సారెకుఁ బగ చాటేది నీ విద్య
తెంకిబెండ్లు ముంచి గుండ్లు దేలించేది నీ విద్య
వంక లొత్తి యాఁటదాని వంచేదే నీ విద్య

(॥ఇంత॥)
బుద్దుల పరియాచకాల బూతు లల్లా నీ విద్య
బద్దుల ఱాతిగుఱ్ఱాలఁబరుపేది నీ విద్య
అద్దివో శ్రీవేంకటేశ అన్నిటాను నన్నుఁ గూడి
ముద్దుల న న్నురమున మోఁచేది నీ విద్య

(||pallavi||)
iṁta kobam̐galanā yiḍu nīdom̐ bŏṁdusesi
maṁtanālu sālum̐ jālu māyalu nī vidya

(||iṁta||)
mūlam̐ buḍisĕḍunīḍa munim̐gedi nī vidya
tālimi vīm̐vu gānarā dām̐gedi nī vidya
joli davvi yĕḍaleni sūgarālu nī vidya
pālam̐suḍavai mānubaḍedi nīvidya

(||iṁta||)
kŏṁkaga velu vĕ ṭṭimmugŏnedi nī vidya
jaṁkĕdo sārĕgum̐ baga sāḍedi nī vidya
tĕṁkibĕṁḍlu muṁchi guṁḍlu deliṁchedi nī vidya
vaṁka lŏtti yām̐ṭadāni vaṁchede nī vidya

(||iṁta||)
buddula pariyāsagāla būdu lallā nī vidya
baddula ṟādiguṭrālam̐barubedi nī vidya
addivo śhrīveṁkaḍeśha anniḍānu nannum̐ gūḍi
muddula na nnuramuna mom̐sedi nī vidya