Imta kobage po ne nitlaidini

ఇంత కోపకే పో నే నిట్లైతిని
Language

(॥పల్లవి॥)
ఇంత కోపకే పో నే నిట్లైతిని
యెంత కెంత మనసు నీ కిచ్చినదే సుమ్మీ

(॥ఇంత॥)
కోపగించ నేరిచితే కోరి నీకు మొక్కుదునా
చాపలపు బొమ్మల నే జంకింతుఁ గాకా
చూపుల నిన్ను సాధించ నోపితే నవ్వుదునా
చేపట్టి నా కొనగోరఁ జిమ్మిరేఁతుఁ గాకా

(॥ఇంత॥)
నిన్ను దూర నేరిచితే నెలఁతల నంపుదునా
తిన్ననిమాటల నేనే తిట్టుదుఁ గాకా
యెన్స నీతో నలిగేది యెఱఁగితేఁ బిలుతునా
యెన్నిక నన్ను ముట్టితే యీసడింతుఁ గాకా

(॥ఇంత॥)
యిట్టే నీకుఁ బగ యైతే యిచ్చకము లాడుదునా
వొట్టి మరుబాణముల కోప్పింతుఁ గాకా
నెట్టిన శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
గట్టిగా నీవొద్ద నింకఁ గాచుకుందుఁ గాకా

(||pallavi||)
iṁta kobage po ne niṭlaidini
yĕṁta kĕṁta manasu nī kichchinade summī

(||iṁta||)
kobagiṁcha neriside kori nīgu mŏkkudunā
sābalabu bŏmmala ne jaṁkiṁtum̐ gāgā
sūbula ninnu sādhiṁcha nobide navvudunā
sebaṭṭi nā kŏnagoram̐ jimmirem̐tum̐ gāgā

(||iṁta||)
ninnu dūra neriside nĕlam̐tala naṁpudunā
tinnanimāḍala nene tiṭṭudum̐ gāgā
yĕnsa nīdo naligedi yĕṟam̐gidem̐ biludunā
yĕnniga nannu muṭṭide yīsaḍiṁtum̐ gāgā

(||iṁta||)
yiṭṭe nīgum̐ baga yaide yichchagamu lāḍudunā
vŏṭṭi marubāṇamula koppiṁtum̐ gāgā
nĕṭṭina śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
gaṭṭigā nīvŏdda niṁkam̐ gāsuguṁdum̐ gāgā