ఇంత కింతే చాలదా యేఁటికమ్మా
(॥పల్లవి॥)
ఇంత కింతే చాలదా యేఁటికమ్మా
దొంతులాయ వలపులు తొలరో వోయమ్మా
(॥॥)
ఆయనాయ వానిసుద్ద లందుకేమి నే మీకుఁ
జేయఁగల పనులకుఁ జెప్పరమ్మా
పోయినపనులకుఁ పోనీ పొద్దువోదా మీ కేమి
చాయలు సన్నలు నింక చవుల గావమ్మా
(॥॥)
యేడ నుండెనేమి వాఁడు యేమిగారణము మీకు
యీడకేడ వచ్చినపని యేదమ్మా
యేడకేడ తలపోఁత లింకా మరవరా
నీడలకు యెండలకుఁ గూడునా వోయమ్మా
(॥॥)
పుక్కట వీనికిఁగాను పూనుక రావద్దు గాని
తక్కక వేరోకమాట తలఁచరమ్మా
గుక్కక శ్రీ వేంకటేశుఁ గూడి మీమాట వింటి
యెక్కె మీచలము నేఁడు యెన్నికాయనమ్మా
(||pallavi||)
iṁta kiṁte sāladā yem̐ṭigammā
dŏṁtulāya valabulu tŏlaro voyammā
(||||)
āyanāya vānisudda laṁdugemi ne mīgum̐
jeyam̐gala panulagum̐ jĕpparammā
poyinabanulagum̐ ponī pŏdduvodā mī kemi
sāyalu sannalu niṁka savula gāvammā
(||||)
yeḍa nuṁḍĕnemi vām̐ḍu yemigāraṇamu mīgu
yīḍageḍa vachchinabani yedammā
yeḍageḍa talabom̐ta liṁkā maravarā
nīḍalagu yĕṁḍalagum̐ gūḍunā voyammā
(||||)
pukkaḍa vīnigim̐gānu pūnuga rāvaddu gāni
takkaga verogamāḍa talam̐sarammā
gukkaga śhrī veṁkaḍeśhum̐ gūḍi mīmāḍa viṁṭi
yĕkkĕ mīsalamu nem̐ḍu yĕnnigāyanammā