ఇంత కాకు గలదా యేమోయి చెలులను
(॥పల్లవి॥)
ఇంత కాకు గలదా యేమోయి చెలులను
చెంతల మందెమేళాలు సేసుకొంటి విట్లా
(॥॥)
యేకతాన నీవు నాకు నిట్టె కతలు చెప్పఁగా
దాకొని సతులెల్లాను తామూ వినేరు
జోకతో నీవు విడేలు సొరిది నా కందియ్యఁగా
చేకొని తామూ నట్టె చేతులు చాఁచేరు
(॥॥)
సరసమాడుచు నా చన్నులు నీవంటఁగాను
సొరిదిఁ దమచన్నులు చూపేరు నీకు
తెరలో నాకు నీ మోవితేనె విందు వెట్టఁగాను
గరిమఁ దామును నట్టె కడునోరూరేరు
(॥॥)
పలుమారు నీవు నాకుఁ బచ్చడము గప్పఁగాను
కలికికాంతలు తమ్మూఁ గప్పుమనేరు
ఆల మేల్మంగనై న న్నట్టె నీవు కూడి తేను
నెలవై శ్రీ వేంకటేశ నిన్నుఁ దామూ కూడేరు
(||pallavi||)
iṁta kāgu galadā yemoyi sĕlulanu
sĕṁtala maṁdĕmeḽālu sesugŏṁṭi viṭlā
(||||)
yegadāna nīvu nāgu niṭṭĕ kadalu sĕppam̐gā
dāgŏni sadulĕllānu tāmū vineru
jogado nīvu viḍelu sŏridi nā kaṁdiyyam̐gā
segŏni tāmū naṭṭĕ sedulu sām̐seru
(||||)
sarasamāḍusu nā sannulu nīvaṁṭam̐gānu
sŏridim̐ damasannulu sūberu nīgu
tĕralo nāgu nī movidenĕ viṁdu vĕṭṭam̐gānu
garimam̐ dāmunu naṭṭĕ kaḍunorūreru
(||||)
palumāru nīvu nāgum̐ bachchaḍamu gappam̐gānu
kaligigāṁtalu tammūm̐ gappumaneru
āla melmaṁganai na nnaṭṭĕ nīvu kūḍi tenu
nĕlavai śhrī veṁkaḍeśha ninnum̐ dāmū kūḍeru