Imta kaadareemda vauda yeṟumgamayya

ఇంత కాతరీఁడ వౌట యెఱుఁగమయ్య
Language

(॥పల్లవి॥)
ఇంత కాతరీఁడ వౌట యెఱుఁగమయ్య
మంతు కెక్కితి విన్నిటా మంచివాఁడవయ్యా

(॥॥)
తరుణికి నీకునుఁ దగవులు చెప్పరాఁగ
గరిమెఁ బోరు గాపెనుఁ గౌఁగిలించేవు
సొరిదిఁ జూచేవారికిఁ జూడ మెచ్చేవానివలె
మరిగించి మొఱఁగేవు మాయకాడవయ్యా

(॥॥)
సంగడి మీ యిద్దరికి సాకిరులు చెప్పఁగాను
చెంగట నున్నయాపెపై సేస వెట్టేవూ
సంగతిగా దీవించి యక్షత లిడేవానివలె
అంగముగాఁ దక్కించేవు అవును జాణవయ్యా

(॥॥)
శ్రీ వేంకటేశ మీలో సిగ్గులు దేరుచ రాఁగా
వావి చెప్పి చుట్ట పాపె మోవి యానేవు
కావించి మొక మిచ్చి యేకాంతమాడేవానివలె
యీవల నన్నుఁ గూడితి వేమి చెప్పేదయ్యా

(||pallavi||)
iṁta kādarīm̐ḍa vauḍa yĕṟum̐gamayya
maṁtu kĕkkidi vinniḍā maṁchivām̐ḍavayyā

(||||)
taruṇigi nīgunum̐ dagavulu sĕpparām̐ga
garimĕm̐ boru gābĕnum̐ gaum̐giliṁchevu
sŏridim̐ jūsevārigim̐ jūḍa mĕchchevānivalĕ
marigiṁchi mŏṟam̐gevu māyagāḍavayyā

(||||)
saṁgaḍi mī yiddarigi sāgirulu sĕppam̐gānu
sĕṁgaḍa nunnayābĕbai sesa vĕṭṭevū
saṁgadigā dīviṁchi yakṣhada liḍevānivalĕ
aṁgamugām̐ dakkiṁchevu avunu jāṇavayyā

(||||)
śhrī veṁkaḍeśha mīlo siggulu derusa rām̐gā
vāvi sĕppi suṭṭa pābĕ movi yānevu
kāviṁchi mŏga michchi yegāṁtamāḍevānivalĕ
yīvala nannum̐ gūḍidi vemi sĕppedayyā