ఇంత గుట్టు సేసుకొని యేమి గట్టుకొనేవే
(॥పల్లవి॥)
ఇంత గుట్టు సేసుకొని యేమి గట్టుకొనేవే
చెంతనుండి యాసతోనెఁ జెనకఁ గాను
(॥॥)
కలువ కన్నుల చూపు గాటేఁ బోసుకొనేవటే
పొలసి మోమెత్తి యిటు చూడఁ జాలవు
వలనైన చిరునవ్వు వడ్డి రెచ్చుకొనేవటే
వెలయ నీ వెంత నవ్వించినా నగవు
(॥॥)
కొండల వంటి కుచాలు గూఁటఁబెట్టు కొనేవటే
దండిగాఁ బయ్యద మూసి దాఁచు కొనేవు
పండిన జవ్వన మిదె పాఁతర వేసేవటే
వుండబో ముసుఁగు వెట్టు కూరకే వున్నదానవు
(॥॥)
ముచ్చట మాటలాడక మూట గట్టు కొనేవటే
తచ్చన మోసముతోఁ బెదవు లెత్తవు
ఇచ్చటఁ జుట్టమ వైతి వేను శ్రీ వేంకటేశుఁడు
మచ్చిక లన్నిటాఁ జల్లి మంతన మాడేవూ
(||pallavi||)
iṁta guṭṭu sesugŏni yemi gaṭṭugŏneve
sĕṁtanuṁḍi yāsadonĕm̐ jĕnagam̐ gānu
(||||)
kaluva kannula sūbu gāḍem̐ bosugŏnevaḍe
pŏlasi momĕtti yiḍu sūḍam̐ jālavu
valanaina sirunavvu vaḍḍi rĕchchugŏnevaḍe
vĕlaya nī vĕṁta navviṁchinā nagavu
(||||)
kŏṁḍala vaṁṭi kusālu gūm̐ṭam̐bĕṭṭu kŏnevaḍe
daṁḍigām̐ bayyada mūsi dām̐su kŏnevu
paṁḍina javvana midĕ pām̐tara vesevaḍe
vuṁḍabo musum̐gu vĕṭṭu kūrage vunnadānavu
(||||)
muchchaḍa māḍalāḍaga mūḍa gaṭṭu kŏnevaḍe
tachchana mosamudom̐ bĕdavu lĕttavu
ichchaḍam̐ juṭṭama vaidi venu śhrī veṁkaḍeśhum̐ḍu
machchiga lanniḍām̐ jalli maṁtana māḍevū