ఇంత గయ్యాళితనము లేమి నేరుచుకొంటివి
(॥పల్లవి॥)
ఇంత గయ్యాళితనము లేమి నేరుచుకొంటివి
చెంతలనే మీఁదటెత్తు చెప్పితిఁ జుమ్మీ
(॥ఇంత॥)
నాతోనే సారె సారె నవ్వేయందు కనను
ఘాతల మొదల నీవు గబ్బివాఁడవు
యేతుల కెవ్వతెనైనా నిట్లానే నవ్వఁబోతే
బూతులఁ దిట్టఁగాను వోపుదువా వినను
(॥ఇంత॥)
చే నంటి నీవు నన్నుఁ జెనకేయందు కనను
పానిపట్టి యెప్పుడూను పల్లదీఁడవు
మానక నీ వూరి వారిమానము దొడుకఁబోతే
పూని యేమి సేతురో నీబుద్ది నీ వెరఁగవా
(॥ఇంత॥)
గక్కన బలిమి నన్నుఁ గాఁగిటఁ గూడితి విట్టె
చక్కఁదనముల మంచిజాణకాఁడవు
యెక్కువ శ్రీవేంకటేశ యిఁకఁ గడలు దొక్కితే
యిక్కువ లంటుచు నేనే యేమని నిన్నందునో
(||pallavi||)
iṁta gayyāḽidanamu lemi nerusugŏṁṭivi
sĕṁtalane mīm̐daḍĕttu sĕppidim̐ jummī
(||iṁta||)
nādone sārĕ sārĕ navveyaṁdu kananu
ghādala mŏdala nīvu gabbivām̐ḍavu
yedula kĕvvadĕnainā niṭlāne navvam̐bode
būdulam̐ diṭṭam̐gānu vobuduvā vinanu
(||iṁta||)
se naṁṭi nīvu nannum̐ jĕnageyaṁdu kananu
pānibaṭṭi yĕppuḍūnu palladīm̐ḍavu
mānaga nī vūri vārimānamu dŏḍugam̐bode
pūni yemi seduro nībuddi nī vĕram̐gavā
(||iṁta||)
gakkana balimi nannum̐ gām̐giḍam̐ gūḍidi viṭṭĕ
sakkam̐danamula maṁchijāṇagām̐ḍavu
yĕkkuva śhrīveṁkaḍeśha yim̐kam̐ gaḍalu dŏkkide
yikkuva laṁṭusu nene yemani ninnaṁduno