Imta galugagumdide nemtibomdulu

ఇంత గలుగకుండితే నేఁటిపొందులు
Language

(॥పల్లవి॥)
ఇంత గలుగకుండితే నేఁటిపొందులు
వింతగా విభుఁడ నాఁడే విన్నవించమా

(॥ఇంత॥)
చిగురుఁ బెదవులనే చెలి నీతో మాటలాడీ
మొగము నీవు చూచితే మొక్కీఁ దాను
నగేటి సెలవులను ననుపులు నటియించీ
తగులైన వలపులతారుకాణఁ లిట్టివి

(॥ఇంత॥)
వంచినట్టి శిరసెత్తి వాడికచూపులు చూచీ
ముంచి నీవు చెనకఁగ మొక్కీఁ దాను
మంచముపై వేడుకల మచ్చికలు వచరించీ
కంచపు రతులలోని కాంక్షలెల్లా నిట్టివి

(॥ఇంత॥)
దప్పులువాయఁగ నిన్ను దండకుఁ దీసుకొనీని
ముప్పిరి నీవు గూడఁగ మొక్కీఁ దాను
చిప్పిలు నీభోగముల చిమ్మిరేఁచీఁ బులకలు
తప్పని శ్రీవేంకటేశ తమకము లిట్టివి

(||pallavi||)
iṁta galugaguṁḍide nem̐ṭibŏṁdulu
viṁtagā vibhum̐ḍa nām̐ḍe vinnaviṁchamā

(||iṁta||)
sigurum̐ bĕdavulane sĕli nīdo māḍalāḍī
mŏgamu nīvu sūside mŏkkīm̐ dānu
nageḍi sĕlavulanu nanubulu naḍiyiṁchī
tagulaina valabuladārugāṇam̐ liṭṭivi

(||iṁta||)
vaṁchinaṭṭi śhirasĕtti vāḍigasūbulu sūsī
muṁchi nīvu sĕnagam̐ga mŏkkīm̐ dānu
maṁchamubai veḍugala machchigalu vasariṁchī
kaṁchabu radulaloni kāṁkṣhalĕllā niṭṭivi

(||iṁta||)
dappuluvāyam̐ga ninnu daṁḍagum̐ dīsugŏnīni
muppiri nīvu gūḍam̐ga mŏkkīm̐ dānu
sippilu nībhogamula simmirem̐sīm̐ bulagalu
tappani śhrīveṁkaḍeśha tamagamu liṭṭivi