Imta galide neevu yegadaanagu raaraadaa

ఇంత గలితే నీవు యేకతానకు రారాదా
Language

(॥పల్లవి॥)
ఇంత గలితే నీవు యేకతానకు రారాదా
వింతలెల్లా నింతి నీకు విన్నవించీఁ గాని

(॥ఇంత॥)
కోరి సేవలుసేయఁగా గుబ్బలు దాఁకించెనంటా
గోర నేల గీరేవు కోమలిని
కూరిమిఁ జూచిన చూపు గురుతులు మోఁచెనంటా
సారె సారె చెలినేల జంకించేవు

(॥ఇంత॥)
గక్కన విడెమియ్యఁగా కళలు రేఁగెనంటా
చక్కని యాపె నేల సాదించేవు
మక్కువతో మాఁటాడఁగా మనసు గరఁగెనంటా
చొక్కుచునేల మానముసోఁకఁ దిట్టేవు

(॥ఇంత॥)
కలసి నవ్వఁగాఁ దమకము లుప్పతిలెనంటా
పలుమారు నెంత కొంగువట్టి తీసేవౌ
యెలమి శ్రీవేంకటేశ యిట్టె యీకె నేలితివి
నిలుచుండఁగానే యెంత నివ్వెరగందేవు

(||pallavi||)
iṁta galide nīvu yegadānagu rārādā
viṁtalĕllā niṁti nīgu vinnaviṁchīm̐ gāni

(||iṁta||)
kori sevaluseyam̐gā gubbalu dām̐kiṁchĕnaṁṭā
gora nela gīrevu komalini
kūrimim̐ jūsina sūbu gurudulu mom̐sĕnaṁṭā
sārĕ sārĕ sĕlinela jaṁkiṁchevu

(||iṁta||)
gakkana viḍĕmiyyam̐gā kaḽalu rem̐gĕnaṁṭā
sakkani yābĕ nela sādiṁchevu
makkuvado mām̐ṭāḍam̐gā manasu garam̐gĕnaṁṭā
sŏkkusunela mānamusom̐kam̐ diṭṭevu

(||iṁta||)
kalasi navvam̐gām̐ damagamu luppadilĕnaṁṭā
palumāru nĕṁta kŏṁguvaṭṭi tīsevau
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ yīgĕ nelidivi
nilusuṁḍam̐gāne yĕṁta nivvĕragaṁdevu