Imta gaddaayabu pomdu lela maagu

ఇంత గడ్డాయపు పొందు లేల మాకు
Language

(॥పల్లవి॥)
ఇంత గడ్డాయపు పొందు లేల మాకు
యెంతేసివారలు నీకు నెదురుచూచేరో

(॥ఇంత॥)
కడుఁ బొద్దువోయ నని కదియఁ దమకించేవు
యెడయ కిక్కడనుంటె నే మాయను
తొడుసు దీరుచుకొని తుద నెక్కడికైనాను
వెడలిపోఁ బని గద్దో వేగిరించేవయ్యా

(॥ఇంత॥)
బత్తి గలవాని బానుపునరు దీసెవు
హత్తి యీడ గొలువుంటె నంకెకు రాదా
వొత్తు కొలు మావరుస వుత్తరువు సేసుకొని
కొత్తగా నెవ్వతె నైనా గూడేవొ అయ్యా

(॥ఇంత॥)
యిల్లు చొచ్చినంతలోనే యిటు నన్నుఁ జొక్కించితి
వొల్లనే ముచ్చటలాడ నొనగూడదా
కొల్లగా శ్రీవేంకటేశ కూడి యేమో సేసేనని
మల్లాడి నాపసఁ జిక్కి మరచితి వయ్యా

(||pallavi||)
iṁta gaḍḍāyabu pŏṁdu lela māgu
yĕṁtesivāralu nīgu nĕdurusūsero

(||iṁta||)
kaḍum̐ bŏdduvoya nani kadiyam̐ damagiṁchevu
yĕḍaya kikkaḍanuṁṭĕ ne māyanu
tŏḍusu dīrusugŏni tuda nĕkkaḍigainānu
vĕḍalibom̐ bani gaddo vegiriṁchevayyā

(||iṁta||)
batti galavāni bānubunaru dīsĕvu
hatti yīḍa gŏluvuṁṭĕ naṁkĕgu rādā
vŏttu kŏlu māvarusa vuttaruvu sesugŏni
kŏttagā nĕvvadĕ nainā gūḍevŏ ayyā

(||iṁta||)
yillu sŏchchinaṁtalone yiḍu nannum̐ jŏkkiṁchidi
vŏllane muchchaḍalāḍa nŏnagūḍadā
kŏllagā śhrīveṁkaḍeśha kūḍi yemo sesenani
mallāḍi nābasam̐ jikki marasidi vayyā