Imta gaddaa vatti rattu yemdaamkaanu

ఇంత గద్దా వట్టి రట్టు యెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఇంత గద్దా వట్టి రట్టు యెందాఁకాను
పంతము నెఱపుదురా పతితోను

(॥ఇంత॥)
పిలిచేతే రావలె ప్రియము చేకొనవలె
చలపాదితనమేలే సతికి
సులభాన నవ్వవలె సూటికిఁ బెనఁగవలె
బలిమి చూపుదురా పతితోను

(॥ఇంత॥)
కడుఁబొందు సేయవలె కనుసన్న నుండవలె
గుడుసుఁదనము లేలే కాంతలకు
అడరి మాటాడవలె అంకెకు లోఁగావలె
బడి బడి సొలతురా పతితోను

(॥ఇంత॥)
యింగిత మెఱఁగవలె ఇచ్చకము సేయవలె
వెంగలితనము లేలే వెలఁదికి
అంగవించి కూడితివి అలమేల్మంగవు నీవు
పంగింతురా శ్రీవేంకటపతితోను

(||pallavi||)
iṁta gaddā vaṭṭi raṭṭu yĕṁdām̐kānu
paṁtamu nĕṟabudurā padidonu

(||iṁta||)
pilisede rāvalĕ priyamu segŏnavalĕ
salabādidanamele sadigi
sulabhāna navvavalĕ sūḍigim̐ bĕnam̐gavalĕ
balimi sūbudurā padidonu

(||iṁta||)
kaḍum̐bŏṁdu seyavalĕ kanusanna nuṁḍavalĕ
guḍusum̐danamu lele kāṁtalagu
aḍari māḍāḍavalĕ aṁkĕgu lom̐gāvalĕ
baḍi baḍi sŏladurā padidonu

(||iṁta||)
yiṁgida mĕṟam̐gavalĕ ichchagamu seyavalĕ
vĕṁgalidanamu lele vĕlam̐digi
aṁgaviṁchi kūḍidivi alamelmaṁgavu nīvu
paṁgiṁturā śhrīveṁkaḍabadidonu