ఇంత దొడ్డవాఁడవు యెరఁగని మముబోంట్ల
(॥పల్లవి॥)
ఇంత దొడ్డవాఁడవు యెరఁగని మముబోంట్ల
పొంతనే తీరుకుఁ దెచ్చి భోగించవయ్యా
(॥ఇంత॥)
సేవ సేయ నేరకున్నా చేయెత్తి మొక్కనేరుతు
కైవసమై మాబత్తి గైకొనవయ్యా
యే వలపించ కుండినా నింట నుండఁగల నీకు
భావముతోనుండి మమ్ము బదికించవయ్యా
(॥ఇంత॥)
కొనియాడ నేరకున్నా కోరి పిలువ నేరుతు
ఘనుఁడవు మామచ్చిక గైకొనవయ్యా
వొనరి పొందకుండినా వొద్ద నుండఁగల నీకు
యెనలేని మాకోరిక యీడేర్చవయ్యా
(॥ఇంత॥)
పైకొనఁగ నేరకున్నా పాన్పు వరచ నేరుతు
కాకు సేయక నాయాస గైకొనవయ్యా
యీకడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నీకు దేవుల నైతి మన్నించఁ గదవయ్యా
(||pallavi||)
iṁta dŏḍḍavām̐ḍavu yĕram̐gani mamuboṁṭla
pŏṁtane tīrugum̐ dĕchchi bhogiṁchavayyā
(||iṁta||)
seva seya neragunnā seyĕtti mŏkkanerudu
kaivasamai mābatti gaigŏnavayyā
ye valabiṁcha kuṁḍinā niṁṭa nuṁḍam̐gala nīgu
bhāvamudonuṁḍi mammu badigiṁchavayyā
(||iṁta||)
kŏniyāḍa neragunnā kori piluva nerudu
ghanum̐ḍavu māmachchiga gaigŏnavayyā
vŏnari pŏṁdaguṁḍinā vŏdda nuṁḍam̐gala nīgu
yĕnaleni māgoriga yīḍersavayyā
(||iṁta||)
paigŏnam̐ga neragunnā pānpu varasa nerudu
kāgu seyaga nāyāsa gaigŏnavayyā
yīgaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nīgu devula naidi manniṁcham̐ gadavayyā