Imta doddavaamdavauda imtulellaa neramgaraa

ఇంత దొడ్డవాఁడవౌత ఇంతులెల్లా నెరఁగరా
Language

(॥పల్లవి॥)
ఇంత దొడ్డవాఁడవౌత ఇంతులెల్లా నెరఁగరా
పంతము లిప్పుడే నీవు పచారించవలెనా

(॥॥)
తరుణి నీ వూడిగాలు తఱచుగఁ జేయఁగాను
సిరులఁజెమట మేనఁ జిప్పిలీని
సురటి విసరరాదా సుద్దు లేమి చెప్పేవు
యిరవైన దొరతన మిప్పుడే చూపేవా

(॥॥)
కొమ్మ నిలుచుండి నీకుఁ గొలువులు సేయఁగాను
చిమ్ములయలపుతోడ సిగ్గువడీని
పమ్మి కూచుండఁబెట్టుక పన్నీరు చల్లఁగరాదా
యెమ్మెలునేతులు నీవు యిప్పుడే చూపేవా

(॥॥)
పడఁతి వేగినంతాను పాదాలు నీ కొత్తగాను
కడఁగి కళలురేఁగి కాఁతాళించీని
అడరి శ్రీ వేంకటేశ అంతలోనే కూడితివి
యెడయని నీనేరుపు లిప్పుడే చూపేవా

(||pallavi||)
iṁta dŏḍḍavām̐ḍavauda iṁtulĕllā nĕram̐garā
paṁtamu lippuḍe nīvu pasāriṁchavalĕnā

(||||)
taruṇi nī vūḍigālu taṟasugam̐ jeyam̐gānu
sirulam̐jĕmaḍa menam̐ jippilīni
suraḍi visararādā suddu lemi sĕppevu
yiravaina dŏradana mippuḍe sūbevā

(||||)
kŏmma nilusuṁḍi nīgum̐ gŏluvulu seyam̐gānu
simmulayalabudoḍa sigguvaḍīni
pammi kūsuṁḍam̐bĕṭṭuga pannīru sallam̐garādā
yĕmmĕlunedulu nīvu yippuḍe sūbevā

(||||)
paḍam̐ti veginaṁtānu pādālu nī kŏttagānu
kaḍam̐gi kaḽalurem̐gi kām̐tāḽiṁchīni
aḍari śhrī veṁkaḍeśha aṁtalone kūḍidivi
yĕḍayani nīnerubu lippuḍe sūbevā